ఖానాపూర్ ఎమ్మెల్యేకు అరుదైన అవకాశం
ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ శాసనసభ్యురాలు అజ్మీరా రేఖానాయక్‌కు అరుదైన అవకాశం లభించింది. గిరిజన ఎమ్మెల్యేగా ఖానాపూర్ నుంచి ఎన్నికైన ఈమెకు అమెరికా విద్య, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌కు ఆహ్వానం అందింది. ఏప్రిల్ 4 నుంచి 24 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.