
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులపై పన్ను తగ్గించాలని మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాగునీటి సరఫరా పైప్‌లపై గతంలో ఎలాంటి పన్నులేదని, అదే విధానాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలని ఆయన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైన జీఎస్టీ కౌన్సిల్ 22వ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు, కార్మికుల భాగస్వామ్యం అధికంగా ఉన్న పనులకు సంబంధించి జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరామన్నారు. అలాగే రూ. కోటి టర్నోవర్ ఉన్న వ్యాపారులను కాంపోజిట్ స్కీం కిందకు తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిపారు. చిన్న, మధ్య తరహా వ్యాపారులపై పడుతున్న భారాన్ని సమీక్షించాలని, లేదంటే జీఎస్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని కేంద్రానికి చెప్పామని ఈటల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment