బాన్సువాడ (నిజామాబాద్ జిల్లా) : కుటుంబసభ్యులంతా ఆరుబయట పడుకుంటే దొంగలు ఇంట్లో పడి దోచుకెళ్లారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బాన్సువాడ పాత పట్టణంలో నివాసముండే ముదిరెడ్డి గోపాల్‌రెడ్డి కుటుంబమంతా శనివారం రాత్రి ఆరుబయట నిద్రించారు. ఇదే అదనుగా చూసుకుని దొంగలు ఇంట్లో నుంచి 8 తులాల బంగారం, 15 తులాల వెండి, రూ. 30వేల నగదును దోచుకెళ్లారు. తెల్లవారిన తర్వాత చూసుకున్న ఇంటి యజమాని దొంగతనం జరిగిందని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
బాన్సువాడలో చోరీ
Published Sun, May 17 2015 10:01 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement