పోలీసులమంటూ రూ.3.70 లక్షల దోపిడీ | robbery in warangal district | Sakshi
Sakshi News home page

పోలీసులమంటూ రూ.3.70 లక్షల దోపిడీ

Published Wed, May 18 2016 3:03 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

robbery in  warangal district

వరంగల్: పోలీసులమంటూ ఇంట్లోకి వచ్చిన దుండగులు రూ.3.70 లక్షలతో ఉడాయించారు. ఈ ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కోట వెంకట్రావు చిట్టీలు నిర్వహిస్తుంటాడు. మంగళవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి పోలీసులమని చెప్పారు. ‘నీ దగ్గర దొంగనోట్లు ఉన్నాయని సమాచారం అందిందం’టూ తుపాకులతో బెదిరించారు.

నిజమేనని నమ్మిన వెంకట్రావు బీరువాలో ఉన్న రూ.70 వేలను వారికి అందించాడు. ఆగంతకులు అంతటితో ఆగక ఇల్లంతా వెదికి మరో రూ.3 లక్షలను కూడా తీసుకుని ఉడాయించారు. రాత్రి 11.30 గంటల సమయంలో వారు వెళ్లిన వెంటనే బాధితుడు 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. అయితే, ఉదయం పది గంటలకు పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఫిర్యాదు అందిన వెంటనే వచ్చి ఉంటే దుండగులు దొరికేవారని బాధితుడు వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement