సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను విద్యాసంస్థలు కచ్చితంగా పాటించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫీజులు పెంచొద్దని.. బలవంతంగా వసూలు చేయొద్దని విద్యాసంస్థల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ఆరు నుంచి పదో తరగతి వరకు టీ శాట్ ద్వారా డిజిటల్ కాస్లులు నిర్వహిస్తామని.. తమ పిల్లలు హాజరయ్యే విధంగా చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులను మంత్రి కోరారు.
మే 7 తర్వాత నిర్ణయం..
ఇంటర్ వాల్యూయేషన్‌పై మే 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. మార్చి 22 నుంచి ఇప్పటి వరకు ప్రజలు సహకరించారని.. మే 7 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌కు మంత్రి సబితా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా శనగలు కొనలేదని.. ఈ ప్రభుత్వం శనగలు కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించిందని వెల్లడించారు. యాసంగి పంటలకు ఎరువులను సిద్ధం చేశామని.. మే 1 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆసరా పెన్షన్‌లు సకాలంలో పడతాయని మంత్రి సబితా రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment