సింగిల్‌విండో ద్వారా సేవలు
► సొసైటీలను రైతుల కల్పవృక్షంలా తయారుచేస్తాం
► చెరువుల పునరుద్ధరణతోనే అభివృద్ధి
► కోటి ఎకరాలకు సాగునీరే లక్ష్యం
► రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కొందుర్గు : రైతుల పంటల సాగుసమయం నుంచి పండించిన ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించే వరకు సింగిల్‌విండో ద్వారా సేవలందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అందుకు సొసైటీలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. మం డల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రి పోచారం చేతుల మీదుగా రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సొసైటీలను రైతుల కల్పవృక్షంలా తయారు చేస్తామన్నారు. గత ప్రభుత్వం హయాంలో విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలయాల వద్ద పర్మిట్లు రాయించుకునేందుకు పడిగాపులు కాసేవారని, విత్తనాలు, ఎరువు ల కోసం రైతులపై పోలీసులు లాఠీచార్జి చేసిన ఘనత ఉందన్నారు. ప్రస్తుతం అలాంటి అవసరం రైతుకు అక్కరలేదన్నారు. ఈ విధానం వల్ల రైతులతోపాటు సొసైటీలు లాభపడుతాయన్నారు.
ఎరువులు, విత్తనాలు సిద్ధం
రైతులకు ప్రభుత్వం 60వేల ఎకరాలకు సరిఫడా విత్తనాలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 906 సొసైటీలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 87 ఉన్నాయని వీటి ద్వారా రైతులకు సేవలందిస్తున్నామన్నారు.
చెరువుల పునరుద్ధరణతోనే అభివృద్ధి
చెరువులకు పూర్వవైభవం తెచ్చేందుకోసమే సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పథ కం తీసుకొచ్చాడన్నారు. కాలేశ్వరం, పాలమూరు, డిండి ప్రాజెక్టులు పూర్తిచేసి రాష్ట్రంలో కోటి ఎకరాల సాగునీరు ఇవ్వాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. అదేవిధంగా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మె ల్యే అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ టీకే శ్రీదేవి, జేడీఏ బాలునాయక్, జెడ్పీటీసీ సభ్యుడు బంగారు స్వరూప, ఏడీఏ భిక్షపతి, ఏఓలు సోయబ తబస్సుమ్, శిరీష, తహసీల్దార్ పాండు, ఎంపీడీఓ యాదయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, డెరైక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
మొక్కుబడిగా నిర్వహిస్తే ఊరుకునేదిలేదు
షాద్‌నగర్‌రూరల్ : ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపట్టిన మిషన్‌కాకతీయ పనులను మొక్కుబడిగా నిర్వహిస్తే ఊరుకునేదిలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచా రం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. చెరువుల మరమ్మతు పనులు భావితరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట శివారులోని లాడెంచెరువులో చెరువు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరై పనులు ప్రారంభించారు. ప్రజల కు ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని ఇరిగేషన్ డీఈ సత్యనారాయణకు తెలిపారు. పనులను ఏ రాత్రయినా ఆకస్మిక తనిఖీ చేసేందుకు వస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజ య్యయాదవ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, ఎంపీపీ బుజ్జిబాబునాయక్, సర్పంచ్ అచ్చగారి అరుంధతియాదయ్య, ఎంపీటీసీ సభ్యుడు కృష్ణవేణిశివ, ఉపసర్పంచ్ సునీతరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.