గిరిజన బాలికపై లైంగిక దాడి | sexual assault on tribal girl | Sakshi
Sakshi News home page

గిరిజన బాలికపై లైంగిక దాడి

Published Thu, Feb 4 2016 4:10 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

గిరిజన బాలికపై లైంగిక దాడి - Sakshi

గిరిజన బాలికపై లైంగిక దాడి

 సూర్యాపేట  మున్సిపాలిటీ:  ఓ గిరిజన బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి నల్లగొండ జిల్లా సూర్యాపేటలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సూర్యాపేట పట్టణంలోని నెహ్రూనగర్‌లో గల ఎస్సీ(ఏ) బాలికల వసతిగృహంలో ఉంటున్న ఓ గిరిజన బాలిక సమీపంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. వసతిగృహానికి ఎదురుగా ఉన్న ఇంట్లో నేరేడుచర్ల మండలం బొత్తలపాలం గ్రామానికి చెందిన షేక్ సైదా(20) అనే వ్యక్తి అద్దెకు ఉండి పాలవ్యాపారం చేస్తున్నాడు. విద్యార్థిని   పాఠశాలకు వెళ్లి వచ్చే క్రమంలో సైదా ఆమెతో పరిచయం ఏర్పర్చుకున్నాడు.


మాయమాటలు చెప్పి తన కామవాంఛ తీర్చుకున్నాడు. జరిగిన విషయాన్ని విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పడంతో సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఆ కామాంధుడిపై ఎస్సీ,ఎస్టీ, రేప్ కేసులతో పాటు పోక్సోయాక్టు కింద కేసు కూడా నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు సూర్యాపేట డీఎస్పీ ఎంఏ రషీద్‌ను ఆశ్రయించారు. విచారణ చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement