గిరిజన బాలికపై లైంగికదాడి | Tribal girl Sexual assault | Sakshi
Sakshi News home page

గిరిజన బాలికపై లైంగికదాడి

Published Sat, Mar 12 2016 4:40 AM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM

గిరిజన బాలికపై లైంగికదాడి - Sakshi

గిరిజన బాలికపై లైంగికదాడి

రాత్రంతా బంధించి
చిత్రహింసలు పెట్టిన యువకుడు
పరారీలో నిందితుడు  
 

కొడవలూరు : ఎనిమిదేళ్ల గిరిజన బాలి కను గిరిజన యువకుడు రాత్రంతా బంధించి చిత్రహింసలు పెట్టి లైంగిక దాడి చేసిన సంఘటన గండవరం సమీపంలోని సంగాయపాళెంలో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు, స్థాని కుల సమాచారం మేరకు.. సంగాయపాళెం వద్ద తూర్పు కాలువ కట్టపై ఆదాల గంగయ్య, మస్తానమ్మ నివాసం ఉంటున్నారు. వీరు వృత్తి రీత్యా ఇటుక లు కోస్తారు. కొద్దిరోజుల క్రితం విజయవాడలో ఇటుకల కోతకు వెళ్లి అక్కడే ఉన్నారు. వీరికి కుమార్తె (8), మూడేళ్ల కుమారుడు ఉన్నారు.

ల్లలను కూడా తమ వెంట తీసుకెళ్లారు. అయితే ఇక్కడే ఉంటున్న గంగయ్య తండ్రి యాకసిరి మస్తానయ్య గండవరం బ్రహ్మోత్సవా ల నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం మనుమరాలి తీసుకు వచ్చాడు. మస్తాన య్య ఇంటి సమీపంలోనే చెంచమ్మ అనే మహిళ కూడా నివసిస్తోంది. ఆమెకు మేనల్లుడు వరుసైన జొన్నవాడకు చెందిన చెంచయ్య, అతడి స్నేహితుడు శీనయ్య (22)తో కలిసి కూలి పనుల నిమిత్తం నాలుగు రోజులుగా చెంచమ్మ ఇంట్లో ఉంటున్నారు. గురువారం సాయంత్రం శీనయ్య గండవరం తిరునాళకు తీసుకుపోతానని మస్తానయ్య మనుమరాలిని తీసుకుపోయాడు.


 కర్కశంగా ప్రవర్తించిన యువకుడు
 బాలికను శీనయ్య గండవరం సమీపంలోని శ్మశానానికి తీసుకెళ్లి బాలిక నోటికి గుడ్డ కట్టేసి చిత్రహింసలు పెట్టి రాత్రం తా లైంగిక దాడి చేశాడు. రాత్రంతా బాలిక ఇంటికి రాకపోవడంతో తాత మస్తానయ్య ఆందోళనకు గురై గండవరమంతా గాలించాడు. శుక్రవారం ఉదయం బాలిక తీవ్ర రక్తస్రావంతో ఏడ్చుకొంటూ ఇంటికి చేరింది. జరిగిన విషయాన్ని బాలిక చెప్పడంతో మనస్తాయ్య పోలీసులను ఆశ్రయించాడు. నెల్లూరురూరల్ డీఎస్పీ తిరుమళేశ్వరరెడ్డి, కోవూరు సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను విచారించారు. శీనయ్య పరారీ కావడంతో అతని స్నేహితుడు చెంచయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించా రు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెంకటాద్రినాయుడు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement