త్వరలో నగరంలో షీ ఆటోలు
మహిళా ఉద్యోగుల భద్రతకు చర్యలు
20న ప్రభుత్వానికి స్వల్పకాలిక
నివేదిక: పూనం వూలకొండయ్యు
హైదరాబాద్ : మహిళా ఉద్యోగులకు భద్రతను కల్పనకు హైదరాబాద్‌లో ‘‘షీ టాక్సీ, షీ ఆటో’’లను వీలైనంత త్వరలో ప్రారంభించేందు కు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహిళల హాస్టళ్లు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, వారు పనిచేసే ప్రదేశాల నుంచి ఈ టాక్సీ, ఆటో సర్వీసులను ఆరంభించనున్నారు. దీనికి సంబంధించి రవాణా, తదితర శాఖల అధికారులతో చర్చలు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని మహిళలు, ఆడపిల్లలకు భద్రతా, రక్షణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం సచివాలయంలో చైర్మన్ పూనం మాలకొండయ్య అధ్యక్షతన సమావేశమై పలు సమస్యలపై చర్చిం చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 20న స్వల్పకాలిక నివేదికను అందజేస్తామని, వచ్చే 60 రోజుల వ్యవధిలో మధ్యంతర, దీర్ఘకాలిక నివేదికను సమర్పిస్తామని పూనం మాలకొండయ్య తెలిపారు.
తరువాత గచ్చిబౌలిలోని సినర్జీ పార్క్‌లో ఐటీ ఉద్యోగులతో మహిళా భద్రత కమిటీ సమావేశమైంది. ఈ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ పనిప్రాంతాల్లో, ప్రయాణ సమయంలో ఎదురవుతున్న సమస్యలను ఐటీ కారిడార్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఆటోడ్రైవర్లపై ఫిర్యాదులు వ చ్చాయని, ప్రజా రవాణాను మరింత మెరుగు పరచాలని సూచించారని తెలిపారు.