Job security for women
-
అంగన్వాడీల మహాధర్నా
ఆదిలాబాద్అర్బన్: స్త్రీ, శిశు సంక్షేమానికి రక్షణ కల్పించాలని, అంగన్వాడీలకు పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆ ధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం చే పట్టిన ఈ ధర్నా 36 గంటలు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఐసీడీఎస్ రక్షణ, అంగన్వాడీలను కార్మికులుగా గు ర్తించడం లేదని, కనీస వేతనం, పీఎఫ్, పెన్షన్, ఈ ఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై ప్రభుత్వాలు చర్చించలేదని అన్నారు. పోషకాహారానికి అయ్యే ఖర్చును లెక్కగట్టి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, ఇది సరైంది కాదని అన్నారు. సెప్టెంబర్ 5న చలో ఢిల్లీని జయప్రదం చేయాలని, కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు, అందరు కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, చిన్నన్న, సుశీల్, వెంకటమ్మ, అనసూయ, పార్వతీ, మంజూల, కళావతి, తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో నగరంలో షీ ఆటోలు
మహిళా ఉద్యోగుల భద్రతకు చర్యలు 20న ప్రభుత్వానికి స్వల్పకాలిక నివేదిక: పూనం వూలకొండయ్యు హైదరాబాద్ : మహిళా ఉద్యోగులకు భద్రతను కల్పనకు హైదరాబాద్లో ‘‘షీ టాక్సీ, షీ ఆటో’’లను వీలైనంత త్వరలో ప్రారంభించేందు కు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహిళల హాస్టళ్లు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, వారు పనిచేసే ప్రదేశాల నుంచి ఈ టాక్సీ, ఆటో సర్వీసులను ఆరంభించనున్నారు. దీనికి సంబంధించి రవాణా, తదితర శాఖల అధికారులతో చర్చలు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని మహిళలు, ఆడపిల్లలకు భద్రతా, రక్షణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం సచివాలయంలో చైర్మన్ పూనం మాలకొండయ్య అధ్యక్షతన సమావేశమై పలు సమస్యలపై చర్చిం చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 20న స్వల్పకాలిక నివేదికను అందజేస్తామని, వచ్చే 60 రోజుల వ్యవధిలో మధ్యంతర, దీర్ఘకాలిక నివేదికను సమర్పిస్తామని పూనం మాలకొండయ్య తెలిపారు. తరువాత గచ్చిబౌలిలోని సినర్జీ పార్క్లో ఐటీ ఉద్యోగులతో మహిళా భద్రత కమిటీ సమావేశమైంది. ఈ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ పనిప్రాంతాల్లో, ప్రయాణ సమయంలో ఎదురవుతున్న సమస్యలను ఐటీ కారిడార్లో పనిచేసే మహిళా ఉద్యోగులు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఆటోడ్రైవర్లపై ఫిర్యాదులు వ చ్చాయని, ప్రజా రవాణాను మరింత మెరుగు పరచాలని సూచించారని తెలిపారు.