బి.శివప్రసాద్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: వైద్య శాఖలో 2 పోస్టుల కు పూర్తి స్థాయి అధికారులను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విధాన పరిషత్ కమిషనర్‌గా డాక్టర్ బి.శివప్రసాద్‌ను నియమించింది. శివప్రసాద్ ప్రస్తుతం కింగ్‌కోఠిలోని జిల్లా ఆస్పత్రిలో మెడికల్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. వీవీపీ కమిషనర్‌గా శివప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె. రాజేందర్, కార్యదర్శి ఖలీముద్దీన్‌లు శివప్రసాద్ కు అభినందనలు తెలిపారు. అలాగే భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శిక్షణ సంస్థ డైరెక్టర్‌గా సోనిబాలదేవికి అదనపు బాధ్యతలు అప్పగించింది. సోని బాలదేవీ ప్రస్తుతం రాష్ట్ర ఔషధ మొక్కల అభివృద్ధి సంస్థ సీఈవోగా పని చేస్తున్నారు. వాకాటి కరుణకు ఈ రెండు పోస్టుల బాధ్యతలను ఉపసంహరించింది.
Comments
Please login to add a commentAdd a comment