Vaidya Vidhana Parishad
-
ఇకపై సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్ట్‌మార్టం
సాక్షి, హైదరాబాద్: ఇక తెలంగాణలో సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన కొత్త పోస్ట్ మార్టం ప్రోటోకాల్ గైడ్ లైన్స్ అనుసరించి తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రమేష్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్ట్ మార్టం నిర్వహించే విధానం అవయవ దానాన్ని, మార్పిడిని కూడా ప్రోత్సహిస్తుందన్నారు. రాత్రిపూట నిర్వహించే అన్ని పోస్ట్‌మార్టంలను వీడియో రికార్డింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని జిల్లా, ఏరియా, సామాజిక ఆసుపత్రుల్లోనూ రాత్రి వేళల్లో పోస్ట్‌మార్టం నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
అంబులెన్సులంటే అలుసా?
ద్విచక్రవాహనం వాడాలంటే నెలకు కనీసం పదివేల వరకూ ఖర్చవుతున్న రోజులివి. ఇక నాలుగు చక్రాల వాహనం వాడాలంటే ఎంత మొత్తంలో ఖర్చవుతుందో వేరే చెప్పాలా? కానీ సర్కారు ఆస్పత్రుల్లోని అంబులెన్సులకు మాత్రం ప్రభుత్వం అందించే మొత్తాలెంతో తెలుసా...? కేవలం రూ. 6వేలే. ఈ మొత్తంతో ఏం చేయాలనుకుంటున్నారు. రోజూ విశాఖ కేజీహెచ్‌కు రోగులను తరలించాలి. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా... దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. విజయనగరం ఫోర్ట్: సర్కారు ఆస్పత్రుల్లోని అంబులెన్సులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. నిరుపేదల రోగులను పెద్దాస్పత్రులకు తరలించా లంటే ఈ వాహనాలే దిక్కు. అలాంటి వాహనాలకు ఇచ్చే నిర్వహణ మొత్తాలు నామమాత్రంగా ఉండటం ఇప్పు డు చర్చనీయాంశమవుతోంది. జిల్లాలో వైద్య విధాన్ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రాస్పత్రి, ఘోషాస్పత్రి, పా ర్వతీపురం ఏరియా ఆస్పత్రి, బాడంగి, భోగాపురం, ఎస్.కోట, గజపతినగరం ఆస్పత్రులు నడుస్తున్నాయి. వీటిల్లో బాడంగికి అంబులెన్సు సౌకర్యం లేదు. భోగా పురం, గజపతినగరం అంబులెన్సులు మూలకు చేరా యి. ఘోషాస్పత్రి, కేంద్రాస్పత్రి, ఎస్.కోట, పార్వతీపు రం ఏరియా ఆస్పత్రులకు అంబులెన్సులున్నా... వాటికి డీజిల్ వేయించలేక అరకొర సేవలందిస్తున్నాయి. నెలకు డీజిల్ బడ్జెట్ రూ.6 వేలే ఒక్కో అంబులెన్సుకు నెలకు కేవలం రూ. ఆరువేలే సర్కారు కేటాయిస్తోంది. వాస్తవంగా అయ్యే ఖర్చులో ఇది పదోవంతు కూడా కాదు. ఒక్కో అంబులెన్సుకు నెలకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు ఖర్చవుతుండగా ప్రభుత్వం ఇచ్చే రూ. ఆరువేలతో ఎలా నెట్టుకురావాలన్నది అంతుచిక్కడంలేదు. జిల్లా కేంద్రాస్పత్రి, ఘోషాస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి, ఎస్.కోట ఆస్పత్రుల నుంచి రోజూ కేజీహెచ్‌కు రోగులను రిఫర్ చేస్తుంటారు. రోజుకు కనీసం ఒక్కో ఆస్పత్రి నుంచి రెండు, మూడు రిఫరల్స్ అయినా ఉంటాయి. కేజీహెచ్‌కు వెళ్లి రావాలంటే డీజిల్‌కు రూ. 700 నుంచి రూ. 800 వరకు ఖర్చవుతుంది. పార్వతీపురం నుంచైతే రూ. 1500ల వరకు ఖర్చవుతుంది. దీంతో ప్రభుత్వం ఇచ్చే డీజిల్ బడ్జెట్ రూ. 6 వేలు ఏమూలకూ చాలట్లేదు. డీజిల్ బడ్జెట్ పెంచని ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వం అంబులెన్సులకు ఇచ్చే డీజిల్ బడ్జెట్ ఇదే. ఏడాదికేడాదికీ డీజిల్ ధరలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో డీజిల్ బడ్జెట్‌ను కూడా పెంచాల్సి ఉంది. ప్రస్తుతం కనీసం నెలకు రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు ఇవ్వాలి. అలా ఇస్తేనే రోగులందరిని ఉచితంగా కేజీహెచ్‌కు తీసుకుని వెళ్లడానికి అవకాశం ఉంటుంది. -
వీవీపీ కమిషనర్‌గా శివప్రసాద్
సాక్షి, హైదరాబాద్: వైద్య శాఖలో 2 పోస్టుల కు పూర్తి స్థాయి అధికారులను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విధాన పరిషత్ కమిషనర్‌గా డాక్టర్ బి.శివప్రసాద్‌ను నియమించింది. శివప్రసాద్ ప్రస్తుతం కింగ్‌కోఠిలోని జిల్లా ఆస్పత్రిలో మెడికల్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. వీవీపీ కమిషనర్‌గా శివప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె. రాజేందర్, కార్యదర్శి ఖలీముద్దీన్లు శివప్రసాద్ కు అభినందనలు తెలిపారు. అలాగే భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శిక్షణ సంస్థ డైరెక్టర్‌గా సోనిబాలదేవికి అదనపు బాధ్యతలు అప్పగించింది. సోని బాలదేవీ ప్రస్తుతం రాష్ట్ర ఔషధ మొక్కల అభివృద్ధి సంస్థ సీఈవోగా పని చేస్తున్నారు. వాకాటి కరుణకు ఈ రెండు పోస్టుల బాధ్యతలను ఉపసంహరించింది. -
వైద్య సిబ్బందికే హెల్త్కార్డుల్లేవ్!
►వైద్య విధాన పరిషత్‌లో డాక్టర్లు, నర్సులు, ఉద్యోగుల గగ్గోలు ►ట్రెజరీ ద్వారా వేతనాలు పొందకపోవడమే వారికి శాపం సాక్షి, హైదరాబాద్: వైద్య సిబ్బందికి కూడా హెల్త్కార్డుల్లేవు. వారి ఆరోగ్యానికి ప్రభుత్వం వైపు నుంచి భరోసా లేదు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులందరికీ ప్రభుత్వం హెల్త్‌కార్డులు ఇచ్చింది. కానీ, వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేసే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని విస్మరించింది. వీరు ప్రభుత్వ ఉద్యోగులే అయినా వారికి ఆరోగ్యకార్డులు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఒకటో తేదీన వేతనాలు అందుకుంటే, వీరు నెలాఖరు వరకు ఆగాల్సి వస్తోంది. వీరికి గుర్తింపు కార్డులు లేవు.. మూడేళ్లుగా పదోన్నతులు లేవు. శాశ్వత ఉద్యోగుల పరిస్థితే ఇలా ఉంటే, అందులో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరీ అధ్వానం. 105 వైద్య విధాన ఆసుపత్రులు: రాష్ట్రంలో 105 వైద్య విధాన పరిషత్ పరిధిలో ఆసుపత్రులున్నాయి. జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లన్నీ వైద్య విధాన పరిషత్ పరిధిలోనే పనిచేస్తున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో 6,500 మంది శాశ్వత ఉద్యోగులు, 1,500 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. అందులో దాదాపు 4 వేల మంది వరకు డాక్టర్లు ఉన్నారు. 1996లో వైద్య విధాన పరిషత్‌ను అటానమస్ సంస్థగా నెలకొల్పారు. అయితే తన కాళ్ల మీద తాను నిలబడే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం దానిని తన అధీనంలోకి తీసుకుంది. అయితే ఇందులో పనిచేసే ఉద్యోగులను 010 పద్దు కింద ట్రెజరీ పరిధిలోకి తీసుకురాలేదు. వీరి వేతనాలను ప్రభుత్వం రెండు, మూడు నెలలకోసారి విడుదల చేస్తోంది. ట్రెజరీ పరిధిలో లేకపోవడం, ఇతరత్రా సాంకేతిక కారణాలు చూపించి వీరికి హెల్త్‌కార్డులు ఇవ్వలేదు. మరోవైపు వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న 158 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఏడేళ్లుగా క్రమబద్ధీకరణకు నోచుకోవడంలేదు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను ఏజెన్సీలు అందజేయడంలేదు. సర్కారు పట్టించుకోవడంలేదు: వైద్య విధాన పరిషత్‌లో పనిచేసే ఉద్యోగులపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, వీరిని ట్రెజరీ పరిధిలోకి తీసుకురావాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడంలేదు. - జూపల్లి రాజేందర్, వైద్య ఉద్యోగుల నేత -
పుష్కర రోజుల్లో సెలవులు రద్దు
వైద్యవిధాన పరిషత్ కమిషనర్ నాయక్ అమరావతి: అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను శనివారం ఏపీ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ బీకే నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ పుష్కరాల 12 రోజులపాటు సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు. అన్ని మందులు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దీనికి సంబంధించిన నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట సీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పీ సాయిబాబు ఉన్నారు. -
మెట్రో కోసం చారిత్రక భవనం కూల్చివేత!
వైద్య విధాన పరిషత్ భవనంకూల్చివేతకు రంగం సిద్ధం మరిన్ని భవనాలూ తొలగించేందుకు ఏర్పాట్లు పార్కింగ్ కోసంఆ స్థలాన్ని వినియోగించనున్న రైల్వే సంస్థ కూల్చివేతలను అడ్డుకుంటామన్న ఉద్యోగులు హెదరాబాద్: హైదరాబాద్‌లోని చారిత్రక భవనాల్లో ఒకటైన.. వైద్య విధాన పరిషత్ భవనాన్ని మెట్రోరైలు ప్రాజెక్టు కోసం కూల్చివేయనున్నారు. పేదరోగులకు వైద్యాన్ని అందించడంలో వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులదే కీలక పాత్ర. ఆ విభాగం ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని కోఠిలో ఉమెన్స్ కళాశాల ఎదురుగా ఉంది. ఈ భవనాన్ని పదిహేను రోజుల్లో కూల్చివేసి, ఆ ఉద్యోగులను మరో చోటికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భవనాన్ని కూల్చిన స్థలంలో మెట్రో రైల్వే స్టేషన్ పార్కింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి హెరిటేజ్ (చారిత్రక) భవనంగా గుర్తింపు ఉన్నా.. కూల్చివేతకు ప్రభుత్వం ఆమోదించడం గమనార్హం. ప్రస్తుతం తాత్కాలికంగా వైద్య విధాన పరిషత్‌కు బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారని... అనంతరం కోఠిలోని అదే క్యాంపస్‌లో ఒక భవనం నిర్మించి ఇచ్చేందుకు మెట్రో రైల్ నిర్మాణ సంస్థ అంగీకరించిందని సమాచారం. అయితే, ఉన్నతాధికారులు మాత్రం ఉద్యోగుల మధ్య కొత్త చిచ్చు పెడుతున్నారు. కోఠిలో ఆరోగ్యరంగానికి సంబంధించిన వివిధ కార్యాలయ భవనాలున్నాయి. అందులో వైద్య విధాన పరిషత్, మలేరియా విభాగం భవనం, కుటుంబ సంక్షేమశాఖ శిక్షణ భవనాలను మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కూల్చివేస్తున్నారు. మిగతా భవనాల్లో ఆంధ్రా ప్రాంత ఉద్యోగులను అలాగే ఉంచి... తెలంగాణ రాష్ట్రం విడిపోతున్నందున తెలంగాణకు సంబంధించిన అన్ని కార్యాలయాలను ఇక్కడినుంచి బంజారాహిల్స్‌లో అద్దెకు తీసుకున్న భవనంలోకి తరలించాలని యోచిస్తున్నారు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. తాము వైద్య విధాన పరిషత్ భవనం కూల్చివేతను అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు జూపల్లి రాజేందర్ స్పష్టం చేశారు. సుమారు 1.7 ఎకరాల స్థలాన్ని తీసుకుని, కేవలం ఐదువందల గజాల్లో భవనాన్ని నిర్మించి ఇవ్వడం తెలంగాణ ఉద్యోగులకు తీవ్రంగా నష్టం చేయడమేనని ఆయన చెప్పారు. మరోవైపు సీమాంధ్ర ఉద్యోగులు కూడా అందరికీ ఆమోద యోగ్యమైన పరిష్కారం దిశగా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
వైద్య‘విధానం’ లేదు
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని పలు ఆస్పత్రులలో పని చేయడానికి రెండు రోజుల క్రితం ఎనిమిది మంది వైద్యులను వైద్య విధాన పరిషత్‌లో కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు. ఏ నిబంధనలనూ పరిగణనలోకి తీసుకోకుండానే వీరిని నియమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదీ ప్రక్రియ ఆస్పత్రులలో వైద్యుల నియామకం చేపట్టాలంటే పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా కలెక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అనుమతి తీసుకోవాలి. వీరికి వేతనాలకు సంబంధించిన నిధులు మంజూరైన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయాలి. దరఖాస్తుల స్వీకరణ అనంతరం రోస్టర్ పాయింట్లు, సీనియారిటీలను పరిగణనలోకి తీసుకొని సెలక్షన్ కమిటీ నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తుంది. సెలక్షన్ కమిటీలో జిల్లా వైద్యాధికారి, జాయింట్ కలెక్టర్, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త ఉంటారు. కలెక్టర్ చెప్పినా ముందుగా నియామకాల కోసం కలెక్టర్‌కు ఫైల్ పంపారు. ఇందుకోసం వైద్య విధాన పరిషత్ కమిషనర్ అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు. కానీ డీసీహెచ్ఎస్ (డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్) దీనిని పరిగణనలోకి తీసుకోకుండా నే నియామకాల ప్రక్రియ చేపట్టారు. కాంట్రాక్టు పద్ధతిలో వైద్యులను నియమించి సంబంధిత సెక్షన్ ఉద్యోగులకు సంబంధం లేకుండానే నియామక పత్రాలను సైతం ఇచ్చేశారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకరిని, బాన్సువాడ ఆస్పత్రిలో నలుగురిని, జిల్లా ఆస్పత్రిలో ముగ్గురిని నియమించారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా నియామకాలు చేపట్టినందున సదరు వైద్యులకు వేతనాలు ఎలా ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలోనూ గత నెలలో ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే వైద్యవిధాన పరిషత్‌లో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇచ్చిన వ్యవహారం వివాదాస్పదమైంది. అయినా సదరు అధికారి తీరు మార్చుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల అనుమతితోనే ఆస్పత్రులలో వైద్యుల అవసరం ఉంది. అందుకే ఉన్నతాధికారులు, కలెక్టర్ అనుమతి తీసుకునే నియామకాలు చేపట్టాం. ఇంతకు ముందు పీహెచ్సీ లలో చేసినవారినే తీసుకున్నాం. - బాలకృష్ణ, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త -
సేవలు చాలు.. ఇక ఇంటికెళ్లండి!
నిజామాబాద్ అర్బన్,న్యూస్‌లైన్ : వైద్య విధాన పరిషత్‌లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించనున్నారు. వచ్చేనెల మార్చి 31వరకు వీరిని కొనసాగిం చి, ఆపై వారిని తొలగించాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త కార్యాలయానికి ఆదేశాలు జారీచేశా రు. గతనెల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో జిల్లా వైద్యాధికారులందరికి కమిషనర్ మౌఖిక ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆస్పత్రిల్లో కొనసాగుతున్న ఔట్సోర్సింగ్ కాంట్రా క్ట్ ఉద్యోగుల వివరాలను నివేదికను జిల్లా అధికారులు వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు అందజేయనున్నారు. జిల్లాలో 111మంది ఉద్యోగులు.. జిల్లాలో వైద్య విధాన పరిషత్ పరిధిలో కామారెడ్డి, బోధన్, బాన్సువాడ ఏరియా ఆస్పత్రుల తో పాటు జిల్లా కేంద్ర ఆస్పత్రి, దోమకొండ,ఎల్లారెడ్డి, మద్నూర్ కమ్యూనిటీ హెల్త్ కేంద్రా లు ఉన్నాయి. వీటిలో 111 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 68 మంది, కాంట్రాక్ట్ ఉద్యోగులు 43 మంది ఉన్నారు. ఏఏ ఉద్యోగులు.. తొలగించనున్న ఉద్యోగుల్లో సెక్యూరిటీ గార్డులు, డ్రైవ ర్లు, ఎలక్ట్రీషియన్లు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు, మాలి, ల్యాబ్ టెక్నీషియన్లు, డీపీవోలు, ఫార్మసిస్టులు ఉన్నా రు. డీసీహెచ్ఎస్ కార్యాలయంలో ముగ్గురు జూనియ ర్ అసిస్టెంట్లు, ఈసీజీ టె క్నీషియన్లు, సిటీ స్కాన్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, డీఆర్ఎ, డీపీవో, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరు కొన్నేళ్లుగా ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఔట్ పేషెంటు రోగులకు వీరి సేవలు ఎంతో ముఖ్యమైనవి. వీరి తొలగింపు వల్ల రోగులకు సేవలందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నా యి. ఆస్పత్రుల్లో రెగ్యులర్ పోస్టుల భర్తీ లేకపోవడం తో ఖాళీల కొరత వల్ల పలుమార్లు తీవ్ర ఆటంకాలు ఏ ర్పడుతున్నాయి. రోగులకు మెరుగైన సేవలందించేం దుకు ఖాళీలు ఉన్నచోట ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో అత్యవసరం ఉ న్న చోట నియామకాలు చేపట్టి రోగులకు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం వీరి తొలగింపు వల్ల అత్యవసర సేవ ల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరిగి వైద్య సేవల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబాల్లో ఆందోళన ఇన్నాళ్లు ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానం లో పనిచేసిన ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించడం తో వీధిన పడే అవకాశం ఏర్పడింది. ఉన్నతాధికారులు వీరిని కొనసాగించకూడదని నిర్ణయం తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఏళ్ల తరబడి ఆస్పత్రుల్లో ప నిచేస్తున్న వారు ఒక్కసారిగా ఉద్యోగం ఊడి పోవడం తో కుటుంబంతో సహా రోడ్డున పడే అవకాశం ఉంది. ఉపాధి కోల్పోయి ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు ఇప్పటికే ఉద్యోగాలు పోతున్నాయ ని ఆందోళన చెందుతున్నారు. తమకు సర్వీసును కొనసాగించాలని వారు కోరుతున్నారు. బయటకు వెళ్తే ఎ క్కడ ఉపాధి లభించడం కష్టమని వారు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. తొలగింపుపై పునరాలోచించుకోవాలని వేడుకుంటున్నారు.