నిజామాబాద్ అర్బన్,న్యూస్‌లైన్ : వైద్య విధాన పరిషత్‌లో కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించనున్నారు. వచ్చేనెల మార్చి 31వరకు వీరిని కొనసాగిం చి, ఆపై వారిని తొలగించాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త కార్యాలయానికి ఆదేశాలు జారీచేశా రు. గతనెల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో జిల్లా వైద్యాధికారులందరికి కమిషనర్ మౌఖిక ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆస్పత్రిల్లో కొనసాగుతున్న ఔట్‌సోర్సింగ్ కాంట్రా క్ట్ ఉద్యోగుల వివరాలను నివేదికను జిల్లా అధికారులు వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు అందజేయనున్నారు.
జిల్లాలో 111మంది ఉద్యోగులు..
జిల్లాలో వైద్య విధాన పరిషత్ పరిధిలో కామారెడ్డి, బోధన్, బాన్సువాడ ఏరియా ఆస్పత్రుల తో పాటు జిల్లా కేంద్ర ఆస్పత్రి, దోమకొండ,ఎల్లారెడ్డి, మద్నూర్ కమ్యూనిటీ హెల్త్ కేంద్రా లు ఉన్నాయి. వీటిలో 111 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు 68 మంది, కాంట్రాక్ట్ ఉద్యోగులు 43 మంది ఉన్నారు.
ఏఏ ఉద్యోగులు..
తొలగించనున్న ఉద్యోగుల్లో సెక్యూరిటీ గార్డులు, డ్రైవ ర్లు, ఎలక్ట్రీషియన్లు, ఏఎన్‌ఎం, స్టాఫ్ నర్సులు, మాలి, ల్యాబ్ టెక్నీషియన్లు, డీపీవోలు, ఫార్మసిస్టులు ఉన్నా రు. డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో ముగ్గురు జూనియ ర్ అసిస్టెంట్లు, ఈసీజీ టె క్నీషియన్లు, సిటీ స్కాన్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, డీఆర్‌ఎ, డీపీవో, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరు కొన్నేళ్లుగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఔట్ పేషెంటు రోగులకు వీరి సేవలు ఎంతో ముఖ్యమైనవి.
వీరి తొలగింపు వల్ల రోగులకు సేవలందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నా యి. ఆస్పత్రుల్లో రెగ్యులర్ పోస్టుల భర్తీ లేకపోవడం తో ఖాళీల కొరత వల్ల పలుమార్లు తీవ్ర ఆటంకాలు ఏ ర్పడుతున్నాయి. రోగులకు మెరుగైన సేవలందించేం దుకు ఖాళీలు ఉన్నచోట ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో అత్యవసరం ఉ న్న చోట నియామకాలు చేపట్టి రోగులకు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం వీరి తొలగింపు వల్ల అత్యవసర సేవ ల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరిగి వైద్య సేవల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
కుటుంబాల్లో ఆందోళన
ఇన్నాళ్లు ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానం లో పనిచేసిన ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించడం తో వీధిన పడే అవకాశం ఏర్పడింది. ఉన్నతాధికారులు వీరిని కొనసాగించకూడదని నిర్ణయం తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఏళ్ల తరబడి ఆస్పత్రుల్లో ప నిచేస్తున్న వారు ఒక్కసారిగా ఉద్యోగం ఊడి పోవడం తో కుటుంబంతో సహా రోడ్డున పడే అవకాశం ఉంది. ఉపాధి కోల్పోయి ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు ఇప్పటికే ఉద్యోగాలు పోతున్నాయ ని ఆందోళన చెందుతున్నారు. తమకు సర్వీసును కొనసాగించాలని వారు కోరుతున్నారు. బయటకు వెళ్తే ఎ క్కడ ఉపాధి లభించడం కష్టమని వారు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. తొలగింపుపై పునరాలోచించుకోవాలని వేడుకుంటున్నారు.
సేవలు చాలు.. ఇక ఇంటికెళ్లండి!
Published Wed, Feb 5 2014 4:38 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement