ఆగని..అకృత్యాలు..! | six year old girl raped by Engineering student sexual assault | Sakshi
Sakshi News home page

ఆగని..అకృత్యాలు..!

Published Sat, Dec 13 2014 4:18 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM

ఆగని..అకృత్యాలు..!

ఆగని..అకృత్యాలు..!

మగాడిలో మృగాడు పూనుతున్నాడు...మానవత్వం మరిచి ఉన్మాదిగా మారుతున్నాడు. క్రూరత్వానికి కేరాఫ్‌గా మారుతూ.. విచక్షణ మరిచి దారుణాలకు తెగబడుతున్నాడు. ప్రేమ పేరుతో ఒకడు వంచించి ప్రాణాలు తీస్తే.. మరొకడు మనవరాలి వయస్సున్న చిన్నారిపై లైంగికదాడి చేశాడు.. ఇంకొకడు బ్లాక్‌మెయిల్‌కు తెగబడి బాధితురాలే బలవన్మరణానికి పాల్పడేలా చేశాడు. ఇలా రోజురోజుకూ  పెరుగుతున్న మృగాళ్ల అకృత్యాలకు అంతే ఉండడం లేదు.    - దేవరకొండ
 
మృగాళ్లకు కేరాఫ్‌గా దేవరకొండ
చదువు పేరుతో వచ్చి దారుణాలకు పాల్పడుతున్న వైనం
చట్టాలను కఠినతరం చేయాలంటున్న ప్రజలు

దేవరకొండ.. మారుమూల గిరి జన ప్రాంతమే అయినా అన్నింటా దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. కానీ మగాడి నైజంలో మాత్రం మార్పురావడం లేదు. దీంతో చిన్నారులు, యువతులు, వివాహితలపై మృగాళ్ల అకృత్యాలు ఎక్కువయ్యాయి. ఏడాది కాలంలోనే హృదయం ద్రవించే ఘటనలు కోకొల్లలు. నిరక్షరాస్యత, అవగాహనారాహిత్యం, పేదరికం వెరసి వెలుగుచూడని దారుణాలు మరెన్నో..!?
 
వెకిలి చేష్టలను చిత్రీకరించి..
పట్టణంలోని ఓ ఇంట్లో అద్దెకు దిగిన ఇంజినీరింగ్ కుర్రాడు సదరు ఇంటి మహిళతోనే అసభ్యంగా ప్రవర్తించాడు. ఆవెకిలి చేష్టలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి యూట్యూబ్‌లో పెట్టి పాశవికానందం పొందా డు. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించి నా ఫలితం లేకపోయింది. సమాజం చిన్నచూపు చూస్తదని భావించిన ఆ అభాగ్యురాలు బలవన్మరణానికి పాల్పడింది.

చిన్నారిపై వృద్ధుడి ఘాతుకం
మొన్నటికి మొన్న చందంపేట మం డలం తెల్దేవర్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఓ తం డాలో 55 ఏళ్ళ వృద్ధుడు 11 ఏళ్ల చిన్నారిని  అడవిలో అటకాయించి లైంగికదాడి చేశాడు. ఆ చిన్నారి రక్తస్రావంతో బాధపడుతుండటం తో ఓ డాక్టర్‌ను కలవగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.తాజాగా శుక్రవారం పట్టణం లో చోటు చేసుకున్న ఘటనతో ఈ ప్రాంత వాసులు ఉలిక్కిపడ్డారు.
 
చట్టాలను కఠినతరం చేయాలి
దేవరకొండలో చోటు చేసుకున్న మూడు ఘటనల్లోనూ కారణమైంది స్థానిక ఇంజి నీరింగ్ కళాశాల విద్యార్థులే కావడం గమనార్హం.  ఆంధ్రా, బీహార్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు స్థానికంగా ఉంటూ కళాశాలలో చదువుతుండడంతో వారిపై తల్లిదండ్రుల నిఘా కరువయ్యింది. దీంతో వారు ఆడిందే ఆటగా మారింది. పోలీసులు ఇటువంటి వారిపై నిఘా పె ట్టాలని ప్రజలు కోరుతున్నారు. దీంతో చట్టాలను మరింత కఠినతరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
 
ఆరేళ్ల బాలికపై లైంగికదాడికి యత్నం
దేవరకొండ :  ఆరేళ్ల బాలికను ఇంట్లోకి పిలిచి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి లైంగికదాడికి యత్నించాడు. ఈ ఘటన దేవరకొండలో శుక్రవారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఓ బాలిక శుక్రవారం ఉదయం కిరాణ దుకాణానికి వెళుతుండగా స్థానిక ఖాదర్ మెమోరియల్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న బీహార్ రాష్ట్రానికి చెందిన షహన్‌షా హలీం అనే విద్యార్థి తన గదిలోకి పిలిచాడు. ఆ చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తిస్తుండగా భయంతో కేకలు వేసింది. దీంతో తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. చిన్నారి జరిగిన విషయం చెప్పడంతో కాలనీవాసులు సదరు విద్యార్థిని చితకబాది పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆ గదిలో అద్దెకుంటున్న నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు షహన్‌షా హలీంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement