స్పెయిన్ టోర్నీకి యెండల సౌందర్య | Spain tournament To Yondala soundarya | Sakshi
Sakshi News home page

స్పెయిన్ టోర్నీకి యెండల సౌందర్య

Published Tue, Feb 10 2015 6:44 AM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

స్పెయిన్ టోర్నీకి యెండల సౌందర్య

స్పెయిన్ టోర్నీకి యెండల సౌందర్య

నిజామాబాద్‌స్పోర్ట్స్ : హాకీ జాతీయ మహిళల జట్టు క్రీడాకారిణి యెండల సౌందర్య స్పెయిన్‌లో నిర్వహించనున్న టోర్నీ ఎంపికైంది. ఈనెల 10నుంచి 24వరకు స్పెయిన్‌లో నిర్వహించనున్న టెస్ట్ హాకీ టోర్నీలో పాల్గొననుంది. జిలాకేంద్రానికి చెందిన సౌందర్య తండ్రి ఇటీవలే మరణించడంతో ప్రస్తుతం ఇక్కడే ఉంటోంది. స్పెయిన్ టోర్నీకి ఎంపిక కావడంతో కుటుంబ సభ్యుల అండతో ఆటకు సిద్ధమైంది. టోర్నీ నిమిత్తం మంగళవారం బయలు దేరనుంది.

టోర్నీలో మనదేశంతో పాటు స్పెయిన్, జర్మనీలు తలపడనున్నాయని, ఒక్కో దేశంతో ఆరుసార్లు పోటీ పడనుందని సీనియర్ క్రీడాకారులు తెలిపారు. ఈ పోటీల్లో సౌందర్య రాణించాలని, దేశానికి, ఇందూరుకు మరింత పేరు తీసుకు రావాలని ఆకాంక్షిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement