పాపన్నపేట: మిషన్ కాకతీయ పనుల్లో ఎలాంటి అవకతవకలు ప్రత్యేక దృష్టి సారించినట్లు క్వాలిటీ అండ్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ వెంకటకృష్ణారెడ్డి, డీఈఈ గిరిధర్‌చారిలు తెలిపారు. మండల పరిధిలోని నార్సింగి రాజన్నచెరువు, బాచారం సాయి చెరువులను శుక్రవారం వారు పరిశీలించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిం దని, ఇందులో అవకతవకలు జరుగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మిషన్ కాకతీయ పనుల పరిశీలనకు రాష్ట్ర వ్యా ప్తంగా 5 ప్రత్యేక బృందాలను ప్రభుత్వం నియమించినట్లు చెప్పారు. చెరువు శిఖంలో ఎవరైనా కబ్జాలో ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి కందకాలు తవ్వాలని వారు సూచించారు. నార్సింగి సర్పంచ్ కిష్టయ్య మాట్లాడుతూ చెరు వు కట్ట వద్ద మెట్లు ఏర్పాటుచేయాలని కోరారు. అనంతరం బాచారం సాయి చెరువును పరిశీలించగా చెరువు వద్ద మత్తడి ఏర్పాటు చేసిన గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు అందుకు సానుకూలంగా స్పందించారు.
మిషన్ కాకతీయపై ప్రత్యేక దృష్టి
Published Sat, May 2 2015 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM
Advertisement
Advertisement