Special attention
-
రౌడీ షీటర్లపై నిఘా
సాక్షి, అనకాపల్లి (విశాఖపట్నం) : త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాలు, పట్టణాల్లో ఉండే రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ చెప్పారు. అనకాపల్లిలోని కొత్తూరు మహార్షి ఫంక్షన్ హాల్లో పోలీస్‌సబ్ డివిజన్ పరిధిలో అధికారులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది నేరాల సంఖ్యను తగ్గించామన్నారు. పాఠశాలలు, కళాశాలల వద్ద ఈవ్ టీజింగ్‌కు పాల్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. అలాగే ప్రస్తుతం ఎక్కువగా గొడవలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై రౌడీ షీట్ నమోదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది వేసవిలో చోరీలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో క్రైం రేటు తగ్గించగలిగామన్నారు. ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారించేందుకు ఆర్అండ్బీ, రవాణాశాఖ, వివిధశాఖల అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మావోస్టుల ప్రభావం ఏజెన్సీ ప్రాంతంలో తగ్గుముఖం పట్టిందని, గతంలో గిరిజనులు వారికి ఆశ్రయం ఇచ్చేవారని, ఇప్పడు ఆ పరిస్థితి లేకుండాపోయిందన్నారు. గిరిజనులు అభివృద్ధి చెందాలని రోడ్లు, సెల్‌టవర్లు ఏర్పాట్లు చేసేందుకు సహకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. బెల్ట్‌షాపులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, అటువంటి వారు తరుచూ ఏర్పాటు చేసినట్లయితే పీడీ యాక్టులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గంజాయి రవాణా చేస్తున్న పాత నేరస్తులపై ఎప్పటికప్పుడు దృష్టిపెడుతూ, ఎక్సైజ్ శాఖతో చర్చిస్తున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎస్.వి.వి.ప్రసాదరావు, సీఐలు కిరణ్‌కుమార్, తాతారావు, రామచంద్రరావు, శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఎన్నికల పోరుకు పోలీసులు రెడీ
సాక్షి, కల్వకుర్తి టౌన్: పార్లమెంట్ ఎన్నికలకు పోలీసుశాఖ ద్వారా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 11న నిర్వహించే ఎన్నికల పటిష్ట బందోబస్తుకు శాఖా పరంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు పోలీ సులు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కల్వకుర్తి డీఎస్పీ పుష్పారెడ్డి తెలిపారు. గత పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాల్లో అలజడులు సృష్టించి, చిన్న, చిన్న వివాదాలను సృష్టించిన వారిని గమనించి, వారిపై ఒక ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. గ్రామ పోలీస్ అధికారులతో సమాచారం తెప్పించుకుని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తుగా వారిని బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కల్వకుర్తి సబ్‌డివిజన్ పరిధిలోని కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూర్, చారకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తామని డీఎస్పీ తెలిపారు. ప్రత్యేక నిఘా కల్వకుర్తి సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో మద్యం తయారీ, విక్రయాలపై నిఘా వేశారు. విక్రయదారులను బైండోవర్ చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి మద్యం, డబ్బు తరలకుండా ప్రత్యేక స్క్వాడ్ బృందం సభ్యులు చర్యలు తీసుకున్నారు. సమస్యస్మాతక ప్రాంతాల గుర్తింపు కల్వకుర్తి సబ్‌డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లోని 169 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో కల్వకుర్తి మండలంలో 61 పోలింగ్ స్టేషన్లలో 4 సమస్యాత్మకంగా, ఊర్కొండ మండలంలో 16 పోలింగ్ స్టేషన్లకు 9 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. అలాగే వెల్దండ మండలంలో 35 పోలింగ్ స్టేషన్లకు 13, వంగూరు మండలంలో 36 పోలింగ్ స్టేషన్లకు రెండు, చారకొండ మండలంలో 21 పోలింగ్ స్టేషన్లకు 3 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర బలగాల కవాతు కల్వకుర్తి సబ్‌డివిజన్ పరిధిలోని అన్ని మండలా ల్లో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలో కేంద్ర బలగాలతో కల్వకుర్తి డీఎస్పీ పుష్పారెడ్డి,, కల్వకుర్తి సీఐ సురేందర్, ఎస్ఐ నర్సింహులు కవాతులో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సబ్‌డివిజన్ పరిధిలో ఇద్దరు సీఐలు, 5 మంది ఎస్ఐలు, 10 మంది ఏఎస్ఐలు, దాదాపు 80 మంది కానిస్టేబు ళ్లు, హోంగార్డులు, 100 మంది దాకా కేంద్ర బలగాలు, మహిళా పోలీసులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. అలాగే కల్వకుర్తి పట్టణంలోనే ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, వాటిని భద్రపరిచేది కూడా కల్వకుర్తి పట్టణంలో ఉండడంతో మరి కొంత మంది కేంద్ర బలగాల పోలీసులు ఇక్కడ విధులు నిర్వహించనున్నారు. స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలి ప్రజలు ప్రశాంత వాతావరణంలో వారి ఓటుహక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పోలీసు శాఖ తరఫున ఏర్పాటు చేశాం. సబ్‌డివిజన్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా వెంటనే తెలిసేలా చర్యలు తీసుకుంటున్నాం. పోలీస్ సిబ్బందితో పాటుగా, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, ఎన్నికల ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. – పుష్పారెడ్డి, డీఎస్పీ, కల్వకుర్తి -
మిషన్ కాకతీయపై ప్రత్యేక దృష్టి
పాపన్నపేట: మిషన్ కాకతీయ పనుల్లో ఎలాంటి అవకతవకలు ప్రత్యేక దృష్టి సారించినట్లు క్వాలిటీ అండ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ వెంకటకృష్ణారెడ్డి, డీఈఈ గిరిధర్చారిలు తెలిపారు. మండల పరిధిలోని నార్సింగి రాజన్నచెరువు, బాచారం సాయి చెరువులను శుక్రవారం వారు పరిశీలించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిం దని, ఇందులో అవకతవకలు జరుగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిషన్ కాకతీయ పనుల పరిశీలనకు రాష్ట్ర వ్యా ప్తంగా 5 ప్రత్యేక బృందాలను ప్రభుత్వం నియమించినట్లు చెప్పారు. చెరువు శిఖంలో ఎవరైనా కబ్జాలో ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి కందకాలు తవ్వాలని వారు సూచించారు. నార్సింగి సర్పంచ్ కిష్టయ్య మాట్లాడుతూ చెరు వు కట్ట వద్ద మెట్లు ఏర్పాటుచేయాలని కోరారు. అనంతరం బాచారం సాయి చెరువును పరిశీలించగా చెరువు వద్ద మత్తడి ఏర్పాటు చేసిన గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు అందుకు సానుకూలంగా స్పందించారు. -
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
నిర్మల్ రూరల్ : వేసవి బడులకు హాజరయ్యే విద్యార్థులపై సీఆర్పీలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆర్వీఎం పీవో డాక్టర్ విజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని డీఆర్సీ భవనంలో ఆదివారం సీఆర్పీలకు వేసవి బడులపై శిక్షణ కార్యక్రమం రెండోరోజు కొనసాగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి ఆర్వీఎం పీవో డాక్టర్ విజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ఆసక్తి కలిగేలా పాఠాలు బోధించాలన్నారు. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, విద్యార్థి చదువులో ముందుండేలా చూడాలన్నారు. ప్రతీ స్కూల్ కాంప్లెక్స్‌కు ఓ పాఠశాలను ఎంపిక చేసి ఆ పాఠశాలలో వేసవి బడులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వేసవి బడులను నిర్వహిస్తున్న ఉద్దేశాన్ని సీఆర్పీలు నెరవేర్చాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులు పాఠశాల పునః ప్రారంభం నాటికి తిరిగి ఇతర విద్యార్థులతో సమానంగా రాణించేలా ఈ శిక్షణ ఇవ్వాలని కోరారు. ఎంఈవో పద్మ, రిసోర్స్‌పర్సన్స్ శ్రీకాంత్‌గౌడ్, ప్రకాశ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు. -
వడివడిగా ‘మెట్రో పొలిస్’ ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగనున్న అంతర్జాతీయ సదస్సు ‘11వ మెట్రో పొలిస్ సదస్సు’కు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో వేగం పెంచింది. ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు సదస్సు జరుగనున్నప్పటికీ, 6వ తేదీ నుంచే కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌ను షోకేస్‌గా చూపేం దుకు, నగర బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేందుకు ఇది మంచి వేదిక కానుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో నగర రహదారుల నుంచి వీధి లైట్ల వరకు ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు విడిది, పర్యటించే మార్గాలను తీర్చిదిద్దుతున్నారు. వై ఫై, 4జీ సేవల్నీ అందుబాటులోకి తెస్తున్నారు. సదస్సులో పాల్గొనేవారు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు గురువారం (నేటి) వరకు సమయం ఉండగా, బుధవారం రాత్రి వరకు 1920 మంది ప్రతినిధులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కాగా, ఈ సదస్సులో ‘స్మార్ట్ సిటీస్, అర్బన్ హౌసింగ్, అర్బన్ ఈక్విటీ, మెట్రో పోలిస్-గవర్నెన్స్, సిటీ మేనేజ్మెంట్-సర్వీసెస్, అర్బన్ ఫైనాన్స్, అర్బన్ హెల్త్’ అంశాలపై చర్చించనున్నారు. వీటిల్లో సిటీ మేనేజ్మెంట్-సర్వీసెస్‌కు సంబంధించి ఎంపిక చేసిన ఏడు అంశాలను చర్చిస్తారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. ప్రతినిధులతో ప్రత్యేక సదస్సులు.. సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నందున.. ఆయా ప్రభుత్వాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా విజ్ఞప్తులు వచ్చాయి. ఈమేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, మేయర్ల మధ్య ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఆయా అంశాల్లో సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి తదితర అంశాలపై చర్చలు జరిపి ఆయా దేశాలు ఎంఓయూలు కుదుర్చుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. జోహన్స్‌బర్గ్, బెర్లిన్, బార్సిలోనాకు చెందిన ప్రతినిధులు వీటిపై బాగా ఆసక్తి చూపుతున్నారు. బిజినెస్ టూ బిజినెస్ (బీ2బీ)గా వ్యవహరించే వేదికల్లో మన దేశం.. ఇతర దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. వీటిలో హైదరాబాద్‌ను ప్రత్యేక అంశంగా తీసుకొని కూడా చర్చిస్తారు. చార్మినార్, ఐటీ కారిడార్, ట్యాంక్ బండ్‌పై ప్రతినిధుల క్షేత్రస్థాయి పర్యటనల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసా రం చేస్తారు. టీవీ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్ నుంచి సైతం వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. సదస్సుకు హాజ రయ్యే ప్రతినిధులకు అందజేసేందుకు ఏరోజు కారోజు నాలుగు పేజీల పత్రికను సైతం వెలువరించనున్నారు. ప్రత్యేక విందులు.. ప్రతినిధులు, వీవీఐపీల కోసం 6వ తేదీన తారామతి బారాదరిలోను, 7న ఫలక్నుమాలోను, 8న జలవిహార్‌లో ప్రత్యేకంగా రాత్రి విందులు ఏర్పాటు చేశారు. ‘అర్బన్ హాకథాన్’ పేరుతో ప్రజలకు కొత్త సదుపాయా లు అందుబాటులోకి తెచ్చేందుకు సాఫ్ట్వేర్ రూపకల్పనకు సంబంధించిన పోటీలు నిర్వహిస్తారు. -
‘పోలవరం’పై ప్రత్యేక దృష్టి
సాక్షి, ఏలూరు : పోలవరం (ఇందిరాసాగర్) ప్రాజెక్టు నిర్మాణమే తన తొలి ప్రాధాన్యమని ప్రకటించిన జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుపై సంబంధిత అధికారులతో శనివారం సమీక్ష జరిపా రు. ఐదేళ్ల్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని, దానిని నెరవేర్చడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. పోల వరం ప్రాజెక్టుకు సంబంధించిన పనుల విషయంలో అవసరమైన నిర్ణయూలను వెంటవెంటనే తీసుకుంటామని, ఈ విషయంలో కిందిస్థాయి అధికారులు నేరుగా తన వద్దకు వచ్చి తక్షణ అనుమతులు పొందాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. నిర్వాసిత గ్రామాల ప్రజలకు మంజూరు చేసిన సహాయాన్ని అర్హులందరికీ అందించాలన్నారు. మొదటి దశలో చేపట్టిన 7 నిర్వాసిత గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులపై కలెక్టర్ సమీక్షిస్తూ గృహ నిర్మాణాన్ని ఇంతవరకూ పూర్తి చేయకపోవడానికి కారణాలేమిటని ఆ శాఖ అధికారులను ప్రశ్నించారు. నిర్వాసితులలో అవగాహన కల్పించి త్వరితగతిన ఇళ్ల నిర్మాణం, రోడ్లు, డ్రెయినేజీ సౌకర్యం కల్పించడం వంటి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఐదు ఎకరాలకు ఒక బోరు చొప్పున మంజారు చేయాలని నిర్వాసితులు కోరుతున్నందునదీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని సూచించారు. పొలవరం ప్రాజెక్టు కుడి కాలువకు అవసరమైన భూసేకరణలో తలెత్తిన సమస్యలను సంబంధిత యజమానులతో చర్చించి పరిష్కరించాలన్నారు. ఇకపై ప్రతి శనివారం సమీక్ష పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుపై ఇకనుంచి ప్రతి శనివారం అధికారులతో సమీక్ష జరుపుతామని కలెక్టర్ భాస్కర్ వెల్లడిం చారు. నెలలో మొదటి, మూడవ శనివారం భూసేకరణపై, రెండవ, నాలుగవ శనివారం నిర్మాణ పనులు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుపై సమీక్ష ఉంటుందని వెల్లడించారు. సంబంధిత అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో సమావేశానికి రావాలని, నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో జారుుంట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, డీఆర్వో కె.ప్రభాకరరావు, పోల వరం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ ఎల్.విజయసారధి, హెడ్ వర్క్స్ ఎస్ఈ కె.పోలేశ్వరరావు, ఇరిగేషన్ ఎస్ఈ డి.తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. -
అభద్రతలో ఆమె!
మనకు స్వాతంత్య్రం ఎప్పుడొచ్చిందని మగవాళ్లను అడిగితే 1947 అని టక్కున చెప్పేస్తారు. అదే ప్రశ్న మహిళలను అడిగితే అదెప్పుడొచ్చింది? అని ఎదురు ప్రశ్నిస్తారేమో!.. ఆడది అర్ధరాత్రి అయినా ధైర్యంగా తిరగగలిగిన నాడు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని గాంధీజీ చెప్పారు. ఇప్పటికీ ఆ పరిస్థితి లేనందున మా వరకూ స్వాతంత్య్రం రానట్లేనని కూడా వివరిస్తారు. నిజమే.. మహిళలపై అకృత్యాలు, వేధింపులు నానాటికీ పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. స్టేషన్లలో నమోదవుతున్న కేసులు, సర్కారు గణాంకాలే దీన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. శ్రీకాకుళం క్రైం: ఈవ్ టీజింగ్, వరకట్న హత్యలు, వేధింపులు, లైంగిక దాడులు.. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులకు అంతే లేదు. మహిళల రక్షణకు ఎన్నో చట్టాలు అమల్లో ఉన్నాయి. మహిళా పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నా మగువల మానప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగణంగా పోలీస్ సిబ్బంది, స్టేష న్లు పెరగకపోవడం.. చట్టాలపై విస్తృత ప్రచారం చేసి అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో నేరాలను అదుపు చేయడం అసాధ్యంగా మారుతోంది. ఈ దిశగానే ఆలోచంచిన పోలీస్ శాఖ సిబ్బంది, సౌకర్యాలు పెంచడంతో నేర నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కసరత్తు చేస్తోంది. దీనివల్ల జిల్లాలోనూ మహిళా పోలీస్స్టేషన్లు, సిబ్బంది సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నేరాల నియంత్రణకు కార్యాచరణ మహిళలపై జరగుతున్న నేరాల గణాంకాలను చూసి పోలీస్ బాస్‌లు ఉలిక్కిపడ్డారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచిందని ఇటీవల జాతీయ స్థాయిలో ప్రకటించిన గణాంకాలు వెల్లడించాయి. దీంతో కొత్త ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడు ఇటీవల సీనియర్ ఐపీఎస్ అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షంచారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు పటిష్ట రక్షణ కల్పించాలని ఈ సమావేశంలోనే నిర్ణయించారు. దీనికి అనుగుణంగా జిల్లాల్లో ప్రతి సబ్‌డివిజన్‌లో ఒక మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి పోలీస్ స్టేషన్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, ఒక మహిళా హోంగార్డు ఖచ్చితంగా ఉండేలా చూడాలని కూడా నిర్ణయించారు. జిల్లాస్థాయిలో ఏఎస్పీ అధ్వర్యంలో మహిళల రక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి దీనికి ఆమోదం పొందాలని నిర్ణయించారు. జిల్లాలో పరిస్థితి ఏమంత భిన్నంగా లేదు రాష్ట్రస్థాయి పరిస్థితికి శ్రీకాకుళం జిల్లా పరిస్థితికీ పెద్ద తేడా లేదు. జిల్లాలోనూ మహిళలపై నేరాల సంఖ్య ఏయేటికాయేడు పెరిగి పోతోంది. వాటిలో కొన్ని మాత్రమే పోలీస్స్టేషన్ల వరకు వస్తున్నాయి. గత మూడేళ్లలో ఇలా స్టేషన్లకు వచ్చిన కేసుల లెక్కలు చూస్తే ఎవరికైనా ఆందోళన కలగకమానదు. మహిళలపై వేధిం పుల కేసులే తీసుకుంటే.. 2012లో జిల్లావ్యాప్తంగా 289 కేసులు నమోదైతే.. 2013లో ఆ సంఖ్య 328కి పెరిగింది. ఇక ఈ ఏడాది లో మొదటి ఐదు నెలల్లోనే 111 కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పోలీస్ బాస్‌లు తీసుకున్న నిర్ణయాలు అమలైతే జిల్లాకు మరో రెండు మహిళా పోలీసుస్టేషన్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం శ్రీకాకుళంలోనే మహిళా పోలీసు స్టేషన్ మాత్రమే ఉంది. దీంతో జిల్లావ్యాప్తంగా జరిగే వరకట్న వేధిం పుల కేసులన్నీ ఇక్కడికే వస్తున్నాయి. ఈ స్టేషన్లో ప్రస్తుతం ఉన్న సీఐ, ఎస్సైలు పురుషులే కావడంతో ఇక్కడికి ఫిర్యాదు చేసేందుకు వచ్చే మహిళలకు ఇబ్బందికరంగా ఉంది. అదే మహి ళా సీఐ, ఎస్సైలు ఉంటే మహిళలు తమ కష్టాలను స్వేచ్ఛగా చెప్పగలుగుతారని అంటున్నారు. మహిళా పోలీసుస్టేషన్లు అవసరమే: ఎస్పీ ఇదే విషయమై జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ మాట్లాడుతూ జిల్లాకు అదనంగా రెండు మహిళా పోలీసుస్టేషన్లు అవసరమేనన్నా రు. మహిళల రక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన తరుణంలో అదనపు స్టేషన్లు ఏ ర్పాటు చేయడంతో వాటిలో మహిళా అధికారులు, సిబ్బందిని నియమిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. -
విద్య, వైద్య, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : విద్య, వైద్య, మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి సారిస్తానని జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వస్తున్న, ప్రస్తుత ఈ సేవా డెరైక్టర్ ముదావత్ ఎం.నాయక్ తెలిపారు. ఆయన ‘సాక్షి’తో బుధవా రం మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు పటిష్టంగా అమలయ్యేలా కృషి చేస్తానని, అట్టడుగు వర్గాల వారందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. నాలుగు రోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తానని, జిల్లాకు వచ్చాక పరిస్థితులను అవగాహన చేసుకుని ప్రజలకు చేరువవుతానని చెప్పారు. తనకున్న అనుభవంతో మంచిపాలన అందిస్తానని తెలిపారు. ప్రస్తుత కలెక్టర్ కాంతిలాల్ దండే కు అనతికాలంలోనే బదిలీ అయింది. గత ఏడాది జూన్ 12న బాధ్యతలు స్వీకరించిన ఆయన ఎన్నో ఒడిదుడుకుల మధ్య 13 నెలల పాటు పనిచేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గరి నుంచి బదిలీ అవుతుందన్న సంకేతాలు ఆయనకొచ్చాయి. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా బదిలీ కావొచ్చని సమాచారం కూడా ఉన్నట్టు తెలిసింది. అయితే, చివరి నిమిషంలో గుంటూరు బదిలీ అయింది. అనుకున్నదొకటి, అయ్యిందొకటని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తనకిదొక గుర్తింపుగా భావిస్తున్నారు. అందరూ సహకరించారు: కాంతిలాల్ దండే జిల్లా ప్రజలకు సేవ చేశానని భావిస్తున్నట్టు గుంటూరుకు బదిలీ అయిన కలెక్టర్ కాంతిలాల్ దండే చెప్పారు. విజయనగరం మంచి జిల్లా అని, ప్రజలంతా పూర్తిగా సహకరించారని తెలిపారు. తాను పనిచేసిన కొద్దికాలంలో ప్రభుత్వ కార్యక్రమాలను సక్రమంగా చేపట్టానన్నారు. జిల్లాకు వచ్చిన దగ్గరి నుంచి బిజీగానే ఉన్నానని, అందరి సహకారంతోనే సక్సెస్ ఫుల్‌గా పనిచేయగలిగానని చెప్పారు. -
వారణాసిపై ప్రత్యేక దృష్టి
వారణాసి: కేంద్ర ఎన్నికల సంఘం వారణాసి లోక్‌సభ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ రేపు పోలింగ్ జరుగనుంది. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ తరపున అజయ్ రాయ్, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మోడీ, కేజ్రీవాల్ పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి వారణాసిపైనే ఉంది. ఇక్కడ పోటీలో 42 మంది అభ్యర్థులు ఉన్నారు. అందువల్ల మూడు ఈవీఎంలను వినియోగిస్తున్నారు. వారణాసి పోలింగ్‌ను పర్యవేక్షించేందుకు 20 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అధికారిగా ప్రవీణ్‌కుమార్‌ను నియమించారు.