వారణాసి
వారణాసి: కేంద్ర ఎన్నికల సంఘం వారణాసి లోక్సభ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ రేపు పోలింగ్ జరుగనుంది. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ తరపున అజయ్ రాయ్, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మోడీ, కేజ్రీవాల్ పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి వారణాసిపైనే ఉంది.
ఇక్కడ పోటీలో 42 మంది అభ్యర్థులు ఉన్నారు. అందువల్ల మూడు ఈవీఎంలను వినియోగిస్తున్నారు.
వారణాసి పోలింగ్‌ను పర్యవేక్షించేందుకు 20 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అధికారిగా ప్రవీణ్‌కుమార్ను నియమించారు.