విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి | dr.vijay kumar said special attention should be taken on stusdents | Sakshi
Sakshi News home page

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

Published Mon, Apr 20 2015 2:56 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 AM

dr.vijay kumar said special attention should be taken on stusdents

నిర్మల్ రూరల్ : వేసవి బడులకు హాజరయ్యే విద్యార్థులపై సీఆర్‌పీలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆర్‌వీఎం పీవో డాక్టర్ విజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని డీఆర్సీ భవనంలో ఆదివారం సీఆర్‌పీలకు వేసవి బడులపై శిక్షణ కార్యక్రమం రెండోరోజు కొనసాగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి ఆర్‌వీఎం పీవో డాక్టర్ విజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

విద్యార్థులకు ఆసక్తి కలిగేలా పాఠాలు బోధించాలన్నారు. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, విద్యార్థి చదువులో ముందుండేలా చూడాలన్నారు. ప్రతీ స్కూల్ కాంప్లెక్స్‌కు ఓ పాఠశాలను ఎంపిక చేసి ఆ పాఠశాలలో వేసవి బడులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వేసవి బడులను నిర్వహిస్తున్న ఉద్దేశాన్ని సీఆర్పీలు నెరవేర్చాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులు పాఠశాల పునః ప్రారంభం నాటికి తిరిగి ఇతర విద్యార్థులతో సమానంగా రాణించేలా ఈ శిక్షణ ఇవ్వాలని కోరారు. ఎంఈవో పద్మ, రిసోర్స్‌పర్సన్స్ శ్రీకాంత్‌గౌడ్, ప్రకాశ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement