మసీద్ అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకుంటున్న రత్నకళ్యాణి
కేశంపేట రంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తుందని జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి రత్నకళ్యాణి అన్నారు. రంజాన్ మాసంలో ఈద్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మండలానికి రూ.2.80 లక్షలను మంజూరు చేసిందన్నారు. శుక్రవారం కేశంపేట, సంతాపూర్, లేమామిడి, నిర్ధవెళ్లి గ్రామాల్లోని ఈద్గాలకు గతంలో మంజూరైన నిధుల ద్వారా జరిగిన అబివృద్ధి పనులను ఆమె పరిశీలించారు.
నిర్ధవెళ్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ మైనార్టీ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేని విషయాన్ని గుర్తించి అధికారులతో మాట్లాడి ఉపాధ్యాయుడిని నియమించేలా చూస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం నిర్ధవెళ్లి, పాపిరెడ్డిగూడ, వెములనర్వ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని ముస్లిం విద్యార్థులకు సూచించారు.
అదే విధంగా తహసీల్దార్ కార్యాలయంలో షాదీముబారక్ ద్వారా మండలంలో ఎంత మంది ముస్లింలు లబ్ధిపోందారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నరేందర్‌రెడ్డి, భద్రప్ప, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment