
సాక్షి, హైదరాబాద్: మధుమేహులు ప్రయాణాల్లో ఏది పడితే అది తినలేరు. ఒకవేళ తిన్నా.. తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే అలాంటి వారికోసం రైల్వే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వారి కోసం రైలు ప్రయాణంలో ప్రత్యేకంగా ఆహారాన్ని అందించనుంది. ఇందుకోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ‘ఫుడ్ ఆన్ ట్రాక్’అనే యాప్‌ను రూపొందించింది. ‘మాతో కలసి ప్రయాణం చేస్తున్నపుడు మీ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం’అంటూ ఐఆర్‌సీటీసీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
ఎలా ఆర్డర్ చేయాలి?
http://bit.ly/2Oees9O లేదంటే.. food on track appని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ యాప్: food on track app
ఐఓఎస్ యాప్: goo.gl/41wxZF
ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకునే ముందు https://www.ecatering.irctc.co.in/లో మీ పీఎన్‌ఆర్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. రాబోయే రైల్వేస్టేషన్‌లో అందుబాటులో ఉన్న మెనూ ప్రత్యక్షమవుతుంది. అందులో మధుమేహం ఉన్న ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకోవచ్చని ఐఆర్‌సీటీసీ తెలిపింది.
యాప్ లేకపోతే..: స్మార్ట్‌ఫోన్ సౌకర్యం లేనివారికి, ఈ విధానం కష్టంగా తోచిన వారికి మరో అవకాశం కూడా ఉంది. 1323కి ఫోన్ చేసి నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేయొచ్చు. లేదా MEAL (P NQ)139కి ఎస్‌ఎంఎస్ కూడా పం పొచ్చు. ఏదైనా కారణంతో ఆర్డర్ వద్దనుకుంటే.. 2 గంటల ముందు రద్దు చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించింది.