
14, 16న సికింద్రాబాద్-పాట్నా ప్రత్యేక రైలు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-పాట్నా మధ్య రెండు ప్రీమియం రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జి సీపీఆర్వో నీలకంఠారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-పాట్నా(02791) స్పెషల్ ఈ నెల 14న ఉదయం 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు పాట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో పాట్నా-సికింద్రాబాద్(02792) ఈ నెల 16న సాయంత్రం 5.30 గంటలకు పాట్నాలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లు రామగుండం, నాగపూర్, జబల్పూర్, మొఘల్‌సరాయి స్టేషన్‌లలో మాత్రమే ఆగుతాయి.