కాజీపేట : అదే ఉత్సాహం.. అదే జోష్.. ఆద్యంతం అదే కోలాహలం.. జాతీయ సాంకేతిక విద్యాసంస్థ(నిట్)లో మూడు రోజులు హోరెత్తించిన స్ప్రింగ్ స్ప్రీ ఉత్సవాలు ఆదివారం రాత్రి ముగిశారుు. మిస్టర్ బనానా నిట్ ప్రధాన కార్యాలయం ఎదుట క్యాప్, బాల్‌గేమ్ వంటి అంశాల్లో విద్యార్థుల ప్రదర్శనలు కట్టిపడేశారుు. ఇసుకతో బొమ్మల తయూరీ ఆకట్టుకుంది. యువ ఇంజినీర్ల సృ జనాత్మకత, ప్రతిభకు స్ప్రింగ్ స్ప్రీ ఉత్సవాలు అద్దం పట్టాయి. బైక్ రేసింగ్ అదరహో అన్పించింది. బైక్‌తో విద్యార్థులు చేసిన ఫీట్లు రెప్పవేయనీయలేదు. ఉత్సాహభరిత వాతావరణంలో మూడురోజులు 108 అంశాల్లో జరిగిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డెరైక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు బహుమతులు ప్రదానం చేశారు. నిట్ విద్యార్థులు ఆలపించిన గీతాలు, నృత్యాలు మంత్రముగ్దులను చేశాయి.
బహుమతులన్ని వరంగల్ నిట్‌కే...
స్ప్రింగ్ స్ప్రీ ఆతిథ్య కళాశాల వరంగల్ నిట్‌కే 80శాతం బహుమతులు వచ్చాయి. దేశ విదేశాలకు చెందిన 1500 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 6వేల మందికి పైగా విద్యార్థులు పలు అంశాల్లో పోటీ పడ్డారు. ఓవరాల్ చాంపియన్ షిప్‌ను వరంగల్ ఎన్‌ఐటీ గెలుచుకుంది. ఎన్‌ఐటీ ఆడిటోరియంలో డ్యాన్స్ షోతో వేడుకలు ముగిసినట్లుగా విద్యార్థి కో-ఆర్డినేటర్ సాయిచంద్ ప్రకటించారు. ప్రొఫెసర్ దినకర్, శ్రీనివాసరావు, నిర్వాహక కమిటి సభ్యులు పాల్గొన్నారు.
స్ప్రింగ్ స్ప్రీ సూపర్..
Published Mon, Mar 2 2015 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM
Advertisement
Advertisement