
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బెల్గాంలో జరుగుతున్న 63వ నేషనల్ గేమ్స్‌లో పాల్గొనేందుకు వెళ్ళిన తెలంగాణ విద్యార్థులు ఇబ్బందుల్లో పడ్డారు. ఈవెంట్లు, గేమ్స్ కేటగిరీల్లో తప్పులు దొర్లడంతో నేషనల్ గేమ్స్ యాజమాన్యం వారికి ప్రవేశం ఇవ్వడం లేదు. నెలల పాటు కసరత్తు పూర్తి చేసిన ఆయా విద్యార్థులు చివరకు పోటీలో పాల్గొనే అవకాశం దక్కకపోవడంతో గందరగోళంలో పడ్డారు.
రాష్ట్రం నుంచి 31 మంది ఈ గేమ్స్‌కు ఎంపికవగా... రెండ్రోజుల క్రితం ఆయా విద్యార్థులు తల్లిదండ్రులతో కలసి బెల్గాం చేరుకున్నారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసే సమయంలో పొరపాట్లు దొర్లడంతో ఈ పరిస్థితి తలెత్తింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే పలువురు విద్యార్థులు పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది. కానీ శని, ఆదివారాలు సెలవుదినాలు కావడంతో అధికారులు అందుబాటులోకి రాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment