నిర్మానుష్యంగా జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్
ఆసిఫాబాద్‌అర్బన్: భానుడు భగభగమంటున్నాడు. రోహిణి కార్తెలో రోళ్ళుపగిలేలా ఎండలు మండుతాయని నానుడి. కానీ ఈ కార్తెకు ముందే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. జిల్లాలో శుక్రవారం రోహిణి కార్తీ ప్రారంభం రోజే ఒక్కసారిగా ఉష్ణోగ్రత నమోదైంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తుతున్నారు. మునుముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. అసలే కరోనా వైరస్ ప్రభావంతో ఇళ్ల వద్దే ఉంటున్న ప్రజలు ఎండ తీవ్రతతో మరింతగా ఉంటి నుంచి బయటకురాని పరిస్థితి.
ఆరంభం నుంచే..
జిల్లాలో వేసవి కాలం ఆరంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కానీ మధ్యలో వర్షాలు కురవడంతో కాస్తా తగ్గినా భానుడి ప్రతాపం మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. గురువారం 45డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత శుక్రవారం ఒక్కసారిగా 45.03 డిగ్రీలుగా నమోదైంది. ఎండలకు వడగాల్పులు తోడయ్యాయి. దీంతో ఇళ్ల నుంచి జనం బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో ఉదయం 10గంటలు దాటితేనే రోడ్లన్నీ నిర్మానుశ్యంగా మారుతున్నాయి. శుక్రవారం నుంచి రోహిణికార్తి మొదలు కావడంతో వాతావరణంలో భారీ ఎత్తున మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎండ తీవ్రత మరో పది రోజులు ఇలాగే కొనసాగితే వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, చిన్నారులు వడదెబ్బ బారిననపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఉదయం, సాయంత్రం వేళలోనే పనులు ముగించుకోవాలని, మధ్యాహ్నం అయినంత వరకు విశ్రాంతి తీసుకోవడం మేలని సలహాలు ఇస్తున్నారు. ఎండలో తిరుగుతూ పనులు ముగించుకుని ఇంటికి చేరుకోగానే సుమారుగా ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుని నీటిని తాగాలి. రోజుకు కనీసం ఐదు లీటర్ల శుద్ధమైన నీటిని తాగాలని, ఎక్కువగా ద్రవ పదార్థాలను సేవించాలని సూచిస్తున్నా రు . ముఖ్యంగా పండ్ల రసాలు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలని, వడదెబ్బ తగి లితే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వై ద్యు ల సూచనలు పాటించాలని పేర్కొంటున్నారు
Comments
Please login to add a commentAdd a comment