ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ఫిబ్రవరి నెల ఇంకా పూర్తికానేలేదు.. వేసవి పూర్తిస్థారుులో ప్రారంభం కానూలేదు.. కానీ, జిల్లాలో అప్పుడే కరెంటు కోతలు షురువయ్యూరుు. ఇప్పుడిప్పుడే వేడి పెరిగి విద్యుత్‌ను వినియోగించుకుంటున్న ప్రజలకు సెగ తగులుతోంది. అనధికారికంగా విద్యుత్ శాఖ కోతలు ప్రారంభించింది. రోజుకు ఉదయం నుంచి రాత్రి వరకు సమయపాలన లేకుండా రెండు నుంచి మూడు గంటల వరకు కోతలు పెడుతున్నారు. అనధికారిక కోతలతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. జిల్లా కేంద్రంతోపాటు, సబ్‌స్టేషన్ పరిధిలో, మండలాల్లో ఈ కోతలు అమలవుతున్నారుు. అరుుతే.. అధికారికంగా అధికారులు మా త్రం దీన్ని ధ్రువీకరించడం లేదు.
ఆదేశాలు రాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు ఇంకా ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జి ల్లాలో వ్యవసాయరంగానికి 95,095, గృహావసరాలవి 5,70,569, పరిశ్రమల తదితర విద్యుత్ కనెక్షన్లు మొత్తం 7,28,907 ఉన్నాయి. దీనికి అనుగుణంగా సా ధారణ సరఫరా రోజువారీగా 6.026 మిలియన్ యూనిట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ.. జిల్లాకు కేటాయించిన దానికంటే తక్కువగా నే ఫిబ్రవరి నెల కోటా 4.918 మిలియన్ యూనిట్లు సరఫరా అవుతున్నట్లు అధికారులే చెప్తున్నారు. డిమాండ్‌కు, సరఫరాకు వ్యత్యాసం ఎక్కువగా ఉండడంతో లోటును పూడ్చుకోవడం కోసం ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. మొన్నటి వర కు చల్లగా ఉన్న వాతావరణం వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు మండుతున్నాయి.
గురువారం గరిష్ట ఉష్ణోగ్రత 36.5 డిగ్రీలకు చేరుకుంది. గత డిసెంబర్, జనవరి నెలలో 4.682 మిలియన్ యూనిట్లలోపు వాడకం జరగగా బుధవారం విద్యుత్ వినియోగం 5.275 మిలియన్ యూనిట్లు అరుునట్లు విద్యు త్ అధికారులు అంటున్నారు. వారం రోజులుగా విని యోగం ఒక్కసారిగా పెరి గింది. రాబోయే రోజుల్లో కరెంటు వినియోగం మరింత పెరగునున్న దృష్ట్యా వి ద్యుత్ సరఫరాను ఇప్పటి నుంచే అదుపులో పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనధికారిక కోతలు వేళపాలా లేకుండా రెండుమూడు గంటలు విధిస్తున్నారు. గ్రామాల్లో ఏ సమయంలో కరెంటు పోతుంది.. వస్తుందో తెలియకుండా ఉంది.
కోతలు షురూ..
Published Wed, Feb 25 2015 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement