మిర్యాలగూడ :కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రశేఖర్‌రావు ఇద్దరూ.. ఇద్దరే తోడుదొంగలని ఎంసీపీఐ(యూ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని యాద్గార్‌పల్లి ఎస్‌ఎన్‌డీ గార్డెన్‌లో జరిగిన ఎంసీపీఐ(యూ) జిల్లా ప్లీనరీ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు వాగ్ధానాలను చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. వామపక్షాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తుందని ఎంసీపీఐ(యూ) మాత్రమేనన్నారు. పార్టీ సీనియర్ నేతలు భీమిరెడ్డి నర్సింహరెడ్డి, ఓంకార్ కలలను నిజం చే యాలని పార్టీ కార్యకర్తల సూచించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడి లాగా కృషి చేయాలన్నారు. పార్టీ జెండాను తాండ్రకుమార్ ఆవిష్కరించి మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు నివాళులర్పించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా కార్యదర్శిగా వస్కుల మట్టయ్య ఎన్నిక
ఎంసీపీఐ(యూ) జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండలంలోని యాద్గార్‌పల్లి గ్రామానికి చెందిన వ స్కుల మట్టయ్యను పా ర్టీ రాష్ట్ర కార్యదర్శులు తాండ్రకుమార్, వరికుప్పల వెంకన్నల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ప్లీనరీ ఎన్నుకుంది. పార్టీ జిల్లా సహా య కార్యదర్శిగా ఎస్‌కె నజీర్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా వస్కుల సై దమ్మ, కస్తాల సందీప్, ఈర వీరన్న, నల్లూరి రమేష్‌ల తో పాటు మరో 20 మందిని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సైదమ్మ, చంద్రకళ, మల్ల య్య, లక్ష్మి, పెద నర్సయ్య, బాబు, భిక్షం, రమేష్ తదితరులున్నారు.
ఇద్దరూ..ఇద్దరే
Published Wed, May 18 2016 12:53 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM
Advertisement