MCPI (U)
-
ఎంసీపీఐయూ నేత తాండ్ర కుమార్ మృతి
మియాపూర్: ఎంసీపీఐయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తాండ్రకుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో నాలుగు రోజుల నుండి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో సోమవారం ఉదయం 9 గంటల సమయంలో తాండ్రకుమార్ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని కిమ్స్ ఆస్పత్రి నుండి బాగ్‌లింగంపల్లిలోని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యాలయం ఓంకార్ భవన్‌కు తరలించారు. అక్కడి నుంచి మియాపూర్‌లోని ఎంఏనగర్‌లో ఉన్న ఎంసీపీఐయూ కార్యాలయంలో సాయంత్రం వరకు ఉంచారు. అనంతరం మియాపూర్‌లోని సొంత ఇంటికి తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. -
వామపక్షాల ఐక్యతతోనే మతోన్మాద అంతం
సాక్షి, హైదరాబాద్: వామపక్షాల ఐక్యతతోనే మతోన్మాదాన్ని అంతం చేయగలమని ఎంసీపీఐ(యు) అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఎం.డి.గౌస్ అన్నారు. ఎంసీపీఐ–ఆర్‌ఎంపీఐ పార్టీల ఐక్యత సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ‘వర్తమాన రాజకీయాలు– వామపక్షపార్టీల ఐక్యత అవకాశాలు’పై సదస్సు జరిగింది. సదస్సులో ఆర్‌ఎంపీఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మంగత్‌రాం పాస్లా, చైర్మన్ గంగాధరన్ తదితరులు పాల్గొని మాట్లాడారు. గౌస్ మాట్లాడుతూ.. మత స్వేచ్ఛను హరించివేయడం, పౌరహక్కులను అణచివేయడం, ప్రజల ఆహార అలవాట్లు, ఆచార వ్యవహారాలపైనా ఆంక్షలు విధించడం వంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలనే ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తోందని ఈ 2 పార్టీలనుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం వామపక్షపార్టీలపై ఉందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన బహుజన లెఫ్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) కారుచీకటిలో కాంతిరేఖ వంటిదన్నారు. కాంగ్రెస్, బీజేపీ,టీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా వామపక్షా లు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఎంసీపీఐ–ఆర్‌ఎమ్‌పీఐ ముఖ్యనేతలు కిరణ్జిత్, నారాయణన్, మద్దికాయల అశోక్, అనుభవదాస్ శాస్త్రి, కాటం నాగభూషణం, వనం సుధాకర్, హర్‌కమల్‌లు పాల్గొన్నారు. -
ఇద్దరూ..ఇద్దరే
మిర్యాలగూడ :కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రశేఖర్‌రావు ఇద్దరూ.. ఇద్దరే తోడుదొంగలని ఎంసీపీఐ(యూ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని యాద్గార్పల్లి ఎస్ఎన్డీ గార్డెన్లో జరిగిన ఎంసీపీఐ(యూ) జిల్లా ప్లీనరీ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు వాగ్ధానాలను చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. వామపక్షాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తుందని ఎంసీపీఐ(యూ) మాత్రమేనన్నారు. పార్టీ సీనియర్ నేతలు భీమిరెడ్డి నర్సింహరెడ్డి, ఓంకార్ కలలను నిజం చే యాలని పార్టీ కార్యకర్తల సూచించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడి లాగా కృషి చేయాలన్నారు. పార్టీ జెండాను తాండ్రకుమార్ ఆవిష్కరించి మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు నివాళులర్పించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా వస్కుల మట్టయ్య ఎన్నిక ఎంసీపీఐ(యూ) జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండలంలోని యాద్గార్పల్లి గ్రామానికి చెందిన వ స్కుల మట్టయ్యను పా ర్టీ రాష్ట్ర కార్యదర్శులు తాండ్రకుమార్, వరికుప్పల వెంకన్నల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ప్లీనరీ ఎన్నుకుంది. పార్టీ జిల్లా సహా య కార్యదర్శిగా ఎస్కె నజీర్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా వస్కుల సై దమ్మ, కస్తాల సందీప్, ఈర వీరన్న, నల్లూరి రమేష్‌ల తో పాటు మరో 20 మందిని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సైదమ్మ, చంద్రకళ, మల్ల య్య, లక్ష్మి, పెద నర్సయ్య, బాబు, భిక్షం, రమేష్ తదితరులున్నారు.