
ఇబ్రహీంపట్నం రూరల్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్లలో ఉన్న టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌లో రూ. 400 కోట్లతో నెలకొల్పిన టాటా బోయింగ్ ఎయిరోస్పేస్ విమానాల తయారీ పరిశ్రమను గురువారం కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దీంతోపాటే ఏహెచ్–64 బోయింగ్ విమానాలు, హెలికాప్టర్లకు ప్యూస్‌లేజ్ (ప్రధాన భాగాల)ను తయారు చేసే యూనిట్ కూడా ప్రారంభం కానుంది.
ఈ పరిశ్రమకు 2016 జూన్ 19న నాటి రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఆదిబట్ల ఎయిరోస్పేస్ సెజ్‌లో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, టాటా లాకిడ్ మార్టిన్, టాటా సికోర్‌స్కై లాంటి సంస్థలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment