హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంగళవారం భేటీ అయింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించింది. రాష్ట్రంలో వరుస ఎన్ కౌంటర్లు, తెలంగాణ ఆవిర్బావ వేడుకలు, పోలీసు అమరవీరులకు ఎక్స్ గ్రేషియా పెంపు, ఉద్యోగాల భర్తీ, వేసవిలో తాగునీటి సమస్యలు వంటి తదితర అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాగా భేటీలో తొలుత సూర్యాపేట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందికి కేబినెట్ నివాళులు అర్పించింది.
కేబినెట్ నిర్ణయాలు:
- తీవ్రవాదాన్ని ఏ దశలోనూ ఉపేక్షించకుండా అణిచివేయాలని నిర్ణయం
- ఉగ్రవాద, మావోయిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయే పోలీస్ సిబ్బందికి ఎక్స్ గ్రేషియా పెంపు
- రానున్న జూన్ 2 న తెలంగాణ ఏర్పాటు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయం
-గోల్కోండ కోట వేదికగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
- విద్యుత్ శాఖ, పంచాయితీరాజ్ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం
- కొత్తగా 4 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్ణయం
-వేసవి సమస్యలు, తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ