
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తం గా ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. సహజసిద్ధంగా పెరిగే పూలను ఆరా ధించే గొప్ప వేడుకగా నిలిచే బతుకమ్మ.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుం దన్నారు. బతుకమ్మ ఆడే దేవాలయాలు, చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment