
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) శనివారం సాయంత్రం నోటిఫికేషన్ జారీచేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారి వేసిన ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ ఇది కావడం గమనార్హం.
మొత్తం 8,792 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1,941, ఎస్‌జీటీ పోస్టులు 5,415. ఇక 1,011 లాంగ్వేజ్ పోస్టులు, 416 పీఈటీ పోస్టులు, 9 పీఈటీ అసిస్టెంట్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నట్టు తెలిపింది. ఈ పోస్టుల కోసం ఈ నెల 30 నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2018 ఫిబ్రవరి రెండోవారంలో డీఎస్సీ పరీక్ష జరిగే అవకాశముంది.
Notification | Syllabus | Material | Solved Papers |
Comments
Please login to add a commentAdd a comment