తెలంగాణలో నాలుగు స్మార్ట్ సిటీలు? | Telangana four Smart City? | Sakshi
Sakshi News home page

తెలంగాణలో నాలుగు స్మార్ట్ సిటీలు?

Jan 29 2015 3:08 AM | Updated on Apr 7 2019 4:30 PM

తెలంగాణలో నాలుగు స్మార్ట్ సిటీలు? - Sakshi

తెలంగాణలో నాలుగు స్మార్ట్ సిటీలు?

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించనుందని అధికారుల్లో చర్చ సాగుతోంది.

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించనుందని అధికారుల్లో చర్చ సాగుతోంది. ఇందుకు కేంద్రం నిర్వహించే సదస్సుకు ఆ జిల్లాల కమిషనర్లను పంపాలని నిర్ణయించడమే కారణం. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు మార్గదర్శకాలపై కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ నెల 30, 31 తేదీల్లో ఢిల్లీలో సదస్సును నిర్వహిస్తోంది.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్, పురపాలకశాఖ సంచాలకులు బి.జనార్దన్ రెడ్డి, సహాయ సంచాలకులు ఎస్. బాలకృష్ణ సదస్సుకు హాజరై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సమర్పించనున్నారు. వీరితోపాటు జీహెచ్‌ఎంసీ, గ్రేటర్ వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్ నగరాల మునిసిపల్ కమిషనర్లు సోమేశ్ కుమార్, సర్ఫరాజ్, శ్రీనివాస్, కేవీ రమణాచారిలను పంపాలని పురపాలక శాఖ నిర్ణయించడంతో ప్రాధాన్యం ఏర్పడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement