సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆమోదం పొందిన డీఈడీ కాలేజీల జాబితాను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ సర్కారును కోరింది. డీఈడీ కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నందున త్వరితంగా ఈ జాబితాను అందించాలని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో డైట్‌సెట్‌ను ఉమ్మడిగా నిర్వహించి, ఫలితాలు వెలువరించిన విషయం తెలిసిందే. తరువాత రాష్ట్ర విభజన జరగడంతో రెండు ప్రాంతాల్లోని డీఈడీ కాలేజీలకు ఆయా ప్రభుత్వాలు ఆమోదం తెలిపి జాబితాలను డైట్‌సెట్‌కు అందజేయాల్సి ఉంది. ఆ జాబితా వస్తేనే కౌన్సెలింగ్‌కు అవకాశముంటుంది. ఏపీ ప్రభుత్వం ఇటీవలే డీఈడీ కాలేజీల జాబితాను డైట్‌సెట్‌కు అందించింది. తెలంగాణ జాబితా రాకపోవడంతో డైట్‌సెట్ కన్వీనర్ కౌన్సెలింగ్ చేపట్టలేకపోయారు. కాలేజీల జాబితా ఇవ్వాలని కన్వీనర్ సురేందర్‌రెడ్డి సోమవారం తెలంగాణ విద్యా శాఖాధికారులను కోరారు.
త్వరలో డీఈడీ ఫలితాలు: డీఈడీ పరీక్ష ఫలితాలను త్వరలో విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తయిందని, కొద్ది రోజుల్లోనే ఫలితాలు వెలువరిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినందున ఈ ఫలితాలు విడుదలైతే పాసైన వారంతా ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది.
డీఈడీ కాలేజీల జాబితా ఇవ్వండి
Published Wed, Nov 26 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement