
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐసెట్ 2018 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ ఐసెట్‌లో 90.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. 55,191 మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్ష రాయగా, 49,812 మంది అర్హత పొందారు.
15 రోజుల్లో ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఐసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు చైర్మన్ పాపిరెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం గత నెల 23, 24 న ఐసెట్‌ను నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment