ICET resutls
-
తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, వరంగల్: తెలంగాణ ఐసెట్ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో గురువారం ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 56,962 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 51,316 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణత 90.09 శాతం నమోదైంది. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. హస్తినలో మూడు రోజులపాటు ర్యాంకులు ఇలా.. హైదరాబాద్‌కు చెందిన లోకేశ్ మొదటి ర్యాంక్ సాధించాడు. రెండో ర్యాంక్ హైదరాబాద్ విద్యార్థి పమిడి సాయి తనూజ, మల్కాజిగిరికి చెందిన నవీన్ కృష్ణన్ మూడవ ర్యాంక్, హైదరాబాద్ నుంచి ఆర్.నవీనశాంత, తుమ్మ రాజశేఖర నాల్గో ర్యాంక్ సాధించి సత్తా చాటారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదల చేస్తామని ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఐసెట్–2020 పరీక్షా ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 51,991 మంది హాజరు కాగా 40890 ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 10, 11న పరీక్షలు నిర్వహించామని, రికార్డ్ టైంలో ఫలితాలు విడుదల చేశామన్నారు. టాప్-10 ర్యాంకుల్లో ఆరు ర్యాంకుల్లో వెనకబడిన కులాలు, షెడ్యూల్ కులాలకు చెందినవారే ఉన్నారన్నారు. 78.65 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారని, తొలి పదిస్థానాల్లో నలుగురు అమ్మాయిలు చోటు దక్కించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇక నేటితో ఎంసెట్ పరీక్షల నిర్వహణ పూర్తైందన్న మంత్రి.. ఇంజనీరింగ్ విభాగంలో 156899 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. అదే విధంగా అగ్రికల్చర్, మెడిసిన్ విభాగాల్లో 75834 మంది హాజరయ్యారన్నారు. ఇక కరోనా వల్ల ఎంసెట్ లో 21 మంది, ఐసెట్‌లో ఆరుగురు అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదని తెలిపారు. వీరికి అక్టోబరు 7న పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఐఐఐటీ అడ్మిషన్ల గురించి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా పదో తరగతి పరీక్షల ద్వారా ఐఐఐటి అడ్మిషన్స్ జరుగుతాయి. ఈసారి కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. కాబట్టి ఈ ఏడాది ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తాం. ఈ మేరకు ఆర్‌జీకేటీ తీర్మానం చేసింది.100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. పార్ట్- 1లో 50 మార్కులకు మాథ్స్, పార్ట్- 2లో 59 మార్కులకు సైన్స్ ప్రశ్నలు ఉంటాయి. ప్రత్యేక్ష పద్దతిలోనే పరీక్షలు ఉంటాయి. ప్రతి మండలానికి ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు కు కసరత్తు చేస్తున్నాం. తెలంగాణలో సైతం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. 10 వ తరగతి సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష ఉంటుంది’’అని తెలిపారు. నవంబర్ మొదటి, రెండు వారాల్లో పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. -
తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐసెట్ 2018 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ ఐసెట్‌లో 90.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. 55,191 మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్ష రాయగా, 49,812 మంది అర్హత పొందారు. 15 రోజుల్లో ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఐసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు చైర్మన్ పాపిరెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం గత నెల 23, 24 న ఐసెట్‌ను నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏపీ ఐసెట్-2018 ఫలితాలు
సాక్షి, విజయవాడ: ఎంబీఏ, ఎంసీఏ కోర్టులలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్-2018 ఫలితాలను శనివారం విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ పరీక్షకి 48,635 మంది హజరుకాగా 45,037 మంది అర్హత సాధించారు. ఐసెట్‌లో 92.60 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే 6 శాతం ఉత్తీర్ణత పెరిగినట్లు మంత్రి తెలిపారు. అన్ని సెట్ల పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడంతోపాటు, ఫలితాలను కూడా వెల్లడించామని మంత్రి అన్నారు. మొదటిర్యాంక్ గుంటూరుకు చెందిన సీహెచ్ ప్రసన్న కుమార్ సాధించగా, రెండో, మూడో ర్యాంకులను వరుసగా అనంతపురానికి చెందిన భరత్ కుమార్ , సాయికుమార్ రెడ్డిలు కైవసం చేసుకున్నారు. -
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
విశాఖ: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఐసెట్ -2015 ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఎంపీ అవంతి శ్రీనివాస్ ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో కాకినాడకు చెందిన కొడాలి భార్గవ్ 163 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించగా, విశాఖపట్నానికి చెందిన ప్రశాంత్ 160 మార్కులతో ద్వితీయ స్థానం పొందాడు. నెల్లూరుకు చెందిన రాఘవేంద్ర 157 మార్కులు సాధించి తృతీయ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. ఫలితాల కోసం క్లిక్ చేయండి: -
26న ఐసెట్ ఫలితాలు
ఏయూక్యాంపస్ (విశాఖపట్నం): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ 2015 ఫలితాలను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ రామచంద్రమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను www. apicet15. org, www.apsche.org, www.andhrauniversity.edu.in వెబ్సైట్లలో ఉంచుతారని తెలిపారు.