
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
విశాఖ: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఐసెట్ -2015 ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఎంపీ అవంతి శ్రీనివాస్ ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో కాకినాడకు చెందిన కొడాలి భార్గవ్ 163 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించగా, విశాఖపట్నానికి చెందిన ప్రశాంత్ 160 మార్కులతో ద్వితీయ స్థానం పొందాడు. నెల్లూరుకు చెందిన రాఘవేంద్ర 157 మార్కులు సాధించి తృతీయ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు.