అర్చకులు, ఆలయ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్
హైదరాబాద్: ఇక నుంచి ఆలయాల్లో దీపదూప నైవేధ్యాలు సమర్పించేలా చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తున్నామని, జూన్ 2 నుంచి పెంచిన వేతన అమలులోకి వస్తుందని శనివారం ఆయన తెలిపారు. వారికి గౌరవ వేతనం రూ.6 వేలకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ట్రెజరీ ద్వారా జీతాల చెల్లింపు పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.