indrakaranreddy
-
సీఎం గారూ.. రామయ్య పెళ్లికి రండి
భద్రాచలం: భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈ నెల 21న జరిగే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి రావాలని సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆలయ ఈవో బి.శివాజీ, వేదపండితులు కలిసి ఆహ్వాన పత్రిక, జ్ఞాపిక, స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, మాలోత్ కవిత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కూడా ఆహ్వాన పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు స్థలశాయి, ఏఈవో శ్రవణ్‌కుమార్, సీసీ అనిల్, అర్చకులు పాల్గొన్నారు. చదవండి: ప్రైవేటు టీచర్లపై సీఎం కేసీఆర్ వరాల జల్లు -
ఖరీఫ్‌కు ఎస్సారెస్పీ నీరు
ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు నిజంగా ఇది శుభవార్త. ఎగువ నుంచి భారీగా వరద నీరు ఎస్సారెస్పీలోకి చేరుతుండటంతో ఈ ఖరీఫ్‌కు పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జలసౌధలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాఠిల్లతో కలిసి ఈఎన్సీ మురళీధర్, ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే, ఇరిగేషన్ ప్రత్యేకాధికారి కే.ప్రసాద్, అడినిస్ట్రేటీవ్, కమ్ చీఫ్ ఇంజినీరు బి.శంకర్‌లతో సమీక్ష నిర్వహించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి లోయర్ మానేర్ డ్యామ్ (ఎల్ఎండీ)కు నీటి విడుదల, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ ప్రాజెక్టు కింది ఆయకట్టు 4.60 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. నీటి విడుదల ప్రణాళికలను సిద్ధం చేయాలని ఎస్సారెస్పీ అధికారులను మంత్రి హరీశ్ ఆదేశించారు. దీంతో ఆయకట్టుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఇటీవలి వర్షాలతో ఎల్ఎండీ ఎగువ, దిగువన ఉన్న, ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటి విడుదలకు అవకాశం కలిగింది. ఎగువ నుంచి ఎస్సారెస్పీలోకి వరద ఉధృతి పెరిగింది. రెండు రోజులుగా రోజుకు 2.66 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వారం రోజుల కిందటి వరకు ఎస్సారెస్పీ 19 టీఎంసీల కు పరిమితం కాగా సోమవారం రాత్రి నాటికి 56 టీఎంసీలకు చేరినట్లు అధికారులు తెలి పారు. మొత్తం 90 టీఎంసీల నీటి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు ఇదే రకంగా వరద ఉధృతి కొనసాగితే బుధవారం నాటికి ఎస్సారెస్పీ పూర్తిగా నిండుతుందని అధికారవర్గాలు ‘సాక్షి’కి వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్ జలసౌధలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సాగునీటి విడుదలకు ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. దీంతో ఎల్ఎండీ ఎగువన నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, నిర్మల్ జిల్లాల పరిధిలోని 4 లక్షల 62 వేల 920 ఎకరాల ఆయకట్టుకు 32 టీఎంసీల సాగునీరు అందనుం ది. ఎల్ఎండీ దిగువన ఉన్న కరీంనగర్, వరంగల్‌రూరల్, వరంగల్ అర్బన్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 2,05,720 ఎకరా ల ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది. గత రబీలోనూ ఇదే ప్రణాళికను రూపొందించిన ఎస్సారెస్పీ అధికారులు ఆ¯న్, ఆఫ్ పద్ధతిలో 8 రోజుల ఆన్, 7 రోజుల ఆఫ్ విధానం ద్వారా నీటి విడుదల చేశారు. తిరిగి ఈ ఖరీఫ్‌లోనూ ఎస్సారెస్పీ పూర్తి ఆయకట్టుకు నీరిందించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెల్ టూ హెడ్, ఆన్ అండ్ ఆఫ్.. నీటి వృథాను అరికట్టేందుకు టెల్ టూ హెడ్, ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన నీటి విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు సి ద్ధం చేస్తున్నారు. గత రబీలో ఈ పద్ధతి అమలు చేయ డం ద్వారా ఒక్క టీఎంసీ నీటితో 13 వేల నుంచి 14 వేల ఎకరాలకు నీరు ఇవ్వగలిగామన్న అంచనాలో వా రున్నారు. ఇదే అంశంపై సమావేశం మంత్రి హరీశ్‌రావు నీటి విడుదలకు ఇవే మార్గదర్శకాలను సూచించి నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు రైతులు సై తం ఈ పద్ధతితో ఎక్కువ దిగుబడి సాధించామని ఆనందం వ్యక్తం చేశారని కూడా అంటున్నారు. దీంతో ఈ ఖరీఫ్‌లో నీటిని టెల్ టూ హెడ్, ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో వినియోగించేలా పకడ్బందీ చర్యలకు అధి కార యంత్రాంగం సిద్ధమవుతోంది. క్షేత్ర స్థాయిలో ఇంజినీర్లు రైతులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి.. నీటి విడుదల ప్ర ణాళికలు వివరించేందుకు కసరత్తు చేస్తున్నారు. కాలు వ పరిధిలో రైతులకు నీటి విడుదల సమాచారం అం దించేలా ఇంజినీర్లు, రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో టాం టాంలు వేయించే ఆలోచనలో ఉన్నారు.గతేడాది వర్షాలతో ప్రాజెక్టులు నిండగా, వర్షపు నీరు సముద్రం పాలుకాకుండా చెరువులు, కుంటల్లో నీరు నింపిన వి షయం తెలిసిందే. ఎల్ఎండీకి ఎగువ, దిగువన ఉన్న కాలువల ద్వారా జీవీసీ 1 పరిధిలోని 258, జీవీసీ4 పరిధిలోని 439, వరంగల్ (సీసీహెచ్) 154, స్టేజీ2 పరధిలో 270 చెరువు కుంటలను నింపారు. ఈ ఏడా ది కూడా చివరి ఆయకట్టు నీరివ్వడంతోపాటు ఎక్కడైనా నీరు చేరకుండా ఉంటే.. భవిష్యత్‌లో ఆ చెరువులు, కుంటలనూ నింపే యోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. రెండు రోజుల్లో ఫుల్.. నాలుగైదు రోజులుగా ఎస్సారెస్సీలోకి భారీగా వరద చేరుతోంది. ఎగువ నుంచి రోజుకు 2.66 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. 90 టీఎంసీల సా మర్థ్యం గల ఈ ప్రాజెక్టులోకి సో మవారం రాత్రి 7 గంటల వరకు 56 టీఎంసీలు వచ్చాయి. ఈ లెక్కన రెండు రో జుల్లో ప్రాజెక్టు నిండుతుంది. ఖరీఫ్, రబీ పంట లకు ఈసారి కూడా ఢోకాలేదు. నీటి విడుదల కోసం ప్రభుత్వం, మంత్రి హరీశ్‌రావు నీటి విడుదల ప్రణాళికల తయారీకి ఆదేశాలు ఇచ్చారు. – బి.శంకర్, ఏసీఈ, ఎస్సారెస్పీ -
చెర్వుగట్టులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూజలు
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీపార్వతీజడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో అమావాస్యకు ప్రత్యేకత ఉండడంతో గురువారం రాత్రి రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు లక్షపుష్పార్చనలో పాల్గొన్నారు. అనంతరం రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరమే తెలంగాణలోని దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. వాటికి గుర్తింపు రావడానికి ముఖ్యమంత్రి కృషి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారన్నారు. ఆయన వెంట నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. -
నిర్మల్ జిల్లా కోసం పాదయాత్ర
నిర్మల్ నుంచి బాసర అఖిలపక్ష సమావేశంలో జిల్లా సాధన సమితి నిర్మల్‌రూరల్ : నిర్మల్ కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటును అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపట్టనున్నట్లు నిర్మల్ జిల్లా సాధన సమితి కన్వీనర్ నాయిడి మురళీధర్, కో–కన్వీనర్లు డాక్టర్ కృష్ణంరాజు, గండ్రత్ రమేశ్ తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ విశ్రాంతి భవనంలో సోమవారం అఖిలపక్షాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 28న నిర్మల్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని, 29న బాసరకు చేరుకుంటామని అన్నారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు పేర్కొంటునప్పటికీ పూర్తి అధికారిక ప్రకటన వెలువడే వరకు తాము ఉద్యమిస్తామని చెప్పారు. నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాలు, నేరేడిగొండ, బోథ్ ప్రాంతాల ప్రజలు పాల్గొంటారని తెలిపారు. పాదయాత్రలో వివిధ పార్టీలు, సంఘాలు, సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో జిల్లా సాధన సమితి, పార్టీలు, సంఘాల నాయకులు ఎంబడి రాజేశ్వర్, బొలిశెట్టి రాజేశ్, మాకు సాయి, ద్యాగ ప్రచోదయ్, వెంకటేశ్, అబ్దుల్ అజీజ్, ప్రవీణ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీలుగా గూడేలు
కొమురం భీం వర్ధంతి సభలో కేటీఆర్ ♦ ‘జల్ , జంగల్, జమీన్’ స్ఫూర్తితో ముందుకు ♦ మూడేళ్లలో అందరికీ తాగునీరు ♦ ‘వాటర్‌గ్రిడ్’లోనూ ప్రాధాన్యం ♦ జోడేఘాట్‌కు 50 డబుల్ బెడ్రూం ఇళ్లు ♦ పేద గిరిజనులకూ మూడెకరాల సాగు భూమి సాక్షి, మంచిర్యాల: ‘మీ గూడేల్లో మీ రాజ్యమే (మావనాటే, మావరాజ్) ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 500 జనాభా ఉన్న ప్రతి గిరిజన ఆదివాసీ గూడేన్నీ గ్రామ పంచాయతీగా మారుస్తాం. వచ్చే ఎన్నికలను ఆ పం చాయతీల్లోనే నిర్వహిస్తాం’ అని గ్రామీణాభి వృద్ధి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హామీ ఇచ్చారు. జల్, జంగల్, జమీన్ కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన పోరాట యోధుడు కొమురం భీం స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడే ఘాట్‌లో కొమురం భీం 75వ వర్ధంతి సభలో, ఆ సందర్భంగా నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చందూలాల్, జోగు రామన్నలతో కలసి కేటీఆర్ పాల్గొన్నారు. జోడేఘాట్లోని గిరిజనులకు సీఎం కోటా కింద 50 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే లా జోడేఘాట్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ‘జల్ నినాదంతో ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టే మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలకు శ్రీకారం చుట్టాం. వచ్చే నాలుగేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరందిస్తాం. వాటర్‌గ్రిడ్ పథకంలో ఆది వాసీ గూడాలకు ప్రాధాన్యం కల్పిస్తాం. జంగల్ నినాదంతో రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడుకునే ప్రయత్నిస్తున్నాం. హరితహారం కింద మొక్కలు నాటుతున్నాం. ఇక జమీన్ నినాదంతో నిరుపేద గిరిజనులకు కూడా వ్యవసాయ యోగ్యమైన మూడెకరాల భూమిని త్వరలో పంపిణీ చేస్తాం’’ అని వివరించారు. సీఎం దృష్టికి చెల్లప్ప కమిషన్ రద్దు.. చెల్లప్ప కమిషన్‌ను రద్దు చేయాలన్న డిమాండ్‌ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన మరణాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఉట్నూర్‌లో వంద పడకల ఆస్పత్రి, మండల కేంద్రాల్లో 30 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులను ప్రోత్సహించే ందుకు అదనపు వేతనాలు ఇస్తామన్నారు. ‘‘తెలంగాణ పోరాట యోధుల జీవిత చరిత్ర, విజయగాథలు వెలుగులోకి రాకుండా సమైక్య పాలకులు కుట్ర పన్నారు. తెలంగాణ దళిత నాయకుడు వెంకటస్వామి విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై ఆవిష్కరించింది. దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు, కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మహనీయుల జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణ వస్తే ఇక్కడి ప్రజల అస్తిత్వం, ఆత్మ గౌరవం ఆవిష్కృతమవుతుందనడానికి ఈ వర్ధంతి నిదర్శనంగా నిలిచింది’’ అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎంపీలు న గేశ్, బాల్కసుమన్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
తొలిరోజు భారీగా భక్తుల పుణ్యస్నానాలు
హైదరాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిరోజు పుష్కరాల్లో 30 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన పుష్కరాల నిర్వాహణ, భక్తుల రద్దీ, భద్రత, దేవాలయాల వద్ద క్యూలైన్లు, సౌకర్యాలపై ఎప్పటికప్పుడు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. పుష్కరఘాట్లలో తోపులాట జరగకుండా భక్తుల రద్దీ ఆధారంగా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. -
'పుష్కరాలపై కాంగ్రెస్ చేసేది నీచరాజకీయం'
ధర్మపురి : గులాబీ పుష్కరాలంటూ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో రాష్ట్రమంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల రాజేందర్, జోగు రామన్న, ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ పుష్కరాల పనులు పరిశీలించారు. పుష్కరాల నేపథ్యంలో నీటి ఇబ్బందుల దృష్ట్యా కడెం నుంచి నీటిని విడుదల చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నీటిని విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల పనులపై కాంగ్రెస్, బీజేపీ నేతల విమర్శలు అర్ధరహితమని ఇంద్రకరణ్, ఈటెల వ్యాఖ్యానించారు. -
అర్చకులు, ఆలయ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్
హైదరాబాద్: ఇక నుంచి ఆలయాల్లో దీపదూప నైవేధ్యాలు సమర్పించేలా చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తున్నామని, జూన్ 2 నుంచి పెంచిన వేతన అమలులోకి వస్తుందని శనివారం ఆయన తెలిపారు. వారికి గౌరవ వేతనం రూ.6 వేలకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ట్రెజరీ ద్వారా జీతాల చెల్లింపు పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. -
గొల్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని గొల్లపల్లి సాగునీటి ప్రాజెక్టును భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు ఆదివారం పరిశీలించారు. ప్రాజెక్టు ఆయకట్టు వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. ఈ పర్యటనలో దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కూడా పాల్గొన్నారు.