‘తెలంగాణ ప్రజల మధ్యే చిచ్చు’
హైదరాబాద్ : సోమవారం ధర్నాచౌక్ ఘటనలో కాలనీవాసుల ముసుగులో టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, వాకర్ల ముసుగులో మఫ్టీ పోలీసులు రణరంగంగా మార్చారని తెలంగాణ లోక్‌సత్తా పార్టీ ధ్వజమెత్తింది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ఉద్ధేశించిన ధర్నాచౌక్‌లో ప్రతిపక్షాలపై దాడికి ప్రభుత్వం వాడుకోవడం దారుణమని విమర్శించింది.
ఉద్యమ సమయంలో ఆంధ్ర, తెలంగాణ అంటూ ఏ విధంగానైతే పబ్బం గడిపారో, అదే తరహాలో ధర్నాచౌక్ దగ్గర లోకల్-నాన్‌లోకల్ అంటూ తెలంగాణ ప్రజల మధ్యే చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని ఆ పార్టీ నేత జన్నేపల్లి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. ధర్నాచౌక్ చరిత్రలో ఏనాడైనా బాహాబాహికి దిగిన ఉదంతాలున్నాయా అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
కాగా, ధర్నాచౌక్ వద్దంటూ చేపట్టిన శిబిరంలో సాధారణ దుస్తులతో ఫ్లకార్డులు ప్రదర్శించి లేక్ వ్యూ పోలీస్ స్టేషన్ మహిళా సీఐ శ్రీదేవి మీడియాకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.