'తెలంగాణకు ప్రత్యేక పోస్టల్ సర్కిల్' | Telangana new postal circle, says Ravi Shankar Prasad | Sakshi
Sakshi News home page

'తెలంగాణకు ప్రత్యేక పోస్టల్ సర్కిల్'

Published Sat, Dec 13 2014 2:21 PM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

'తెలంగాణకు ప్రత్యేక పోస్టల్ సర్కిల్'

'తెలంగాణకు ప్రత్యేక పోస్టల్ సర్కిల్'

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక పోస్టల్ సర్కిల్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. శనివారం హైదరాబాద్ వచ్చిన రవిశంకర ప్రసాద్ తెలంగాణ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు.  అనంతరం రవిశంకర ప్రసాద్ మాట్లాడుతూ... హైదరాబాద్లో ఐటీఐఆర్కు మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న ఐటీ కంపెనీలు... ఐటీఐఆర్లో విస్తరణ చేపట్టవచ్చని సూచించారు.  

ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం గత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 160 కోట్లు నిధుల సరిపోవని వాటిని పెంచాలని కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్తో జరిగిన భేటీలో కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో చేపట్టిన నూతన ఇండస్ట్రీయల్ పాలసీ వివరాలను ఈ సందర్భంగా కేసీఆర్ కేంద్ర మంత్రికి వివరించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారం ఉంటుందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement