Central IT minister
-
చైనాకు 30 ఏళ్లు పట్టింది .. మనకు పదేళ్లే
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద వ్యవధిలో అంతర్జాతీయ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో కీలకంగా ఎదిగే దిశగా భారత్ ముందుకు పురోగమిస్తోందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఆ స్థాయికి చేరుకునేందుకు చైనాకు 25–30 సంవత్సరాలు పట్టిందని ఆయన పేర్కొన్నారు. మొబైల్ ఫోన్స్ నుంచి కార్ల వరకూ అన్నింటా ఉపయోగించే చిప్‌ల తయారీని దేశీయంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలు భారత్ పురోగమనానికి దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. ‘ఈ 10 బిలియన్ డాలర్ల తోడ్పాటుతో వచ్చే 10 ఏళ్లలో సెమీకండక్టర్ల విభాగంలో కీలకంగా ఎదిగే దిశగా భారత్ ముందుకు వెడుతోంది. దీనికోసం చైనా వంటి దేశాలకు 25–30 ఏళ్లు పట్టేసింది. అయినా అవి ఇంకా పూర్తిగా సఫలం కాలేదు ‘అని మంత్రి చెప్పారు. మెమరీ సొల్యూషన్స్ దిగ్గజం మైక్రాన్ తలపెట్టిన ఏటీఎంపీ ప్రాజెక్టుతో సెమీకండక్టర్ల పరిశ్రమలో ప్రత్యక్షంగా 5,000, పరోక్షంగా 15,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పారు. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముతో .. వేదాంత, ఫాక్స్‌కాన్ వంటి దిగ్గజాలు ఇక్కడ చిప్స్ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. -
కొత్త అవతారంలో నిషేధిత యాప్‌లు ప్రత్యక్షం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం నిషేధించిన యాప్‌లు కొత్త అవతారంలో మళ్లీ ప్రత్యక్షమవుతున్న విషయం వాస్తవమేనని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ బ్లాక్ చేసిన యాప్‌లు పేర్లు మార్చుకుని కొత్త అవతారంలో మళ్ళీ ప్రత్యక్షమవుతున్నట్లు తమ మంత్రిత్వ శాఖకు నివేదికలు, ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన చెప్పారు. చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు ఈ ఫిర్యాదులను తదుపరి పరిశీలన కోసం తాము హోం మంత్రిత్వ శాఖకు పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన యాప్‌లను బ్లాక్ చేయాల్సిందిగా తమ మంత్రిత్వ శాఖ థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్ అయిన గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే నిషేధిత యాప్‌లకు సంబంధించిన ఐపీ అడ్రస్‌లను బ్లాక్ చేయవలసిందిగా టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. -
5జీ స్పెక్ట్రమ్ వేలంపై కీలక ప్రకటన చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది(2022) ఏప్రిల్-మే మధ్య 5జీ స్పెక్ట్రమ్ వేలం జరిగే అవకాశం ఉన్నట్లు కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్నావ్ గురువారం తెలిపారు. టెలికాం ఆపరేటర్ల కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన ఉపశమన చర్యలు మొదటి సంస్కరణలుగా చెప్పారు. "రాబోయే 2-3 సంవత్సరాలలో టెలికామ్ నియంత్రణ వ్యవస్థ మారాలి" అని వైష్ణవ్ తెలిపారు. ఒక మీడియా కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. భారతదేశ టెలికామ్ సెక్టార్ రెగ్యులేషన్‌ను ప్రపంచ ఉత్తమంగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. "కాబట్టి, ఇక మేము టెలికామ్ పరంగా వరుస సంస్కరణలతో వస్తాము" అని అన్నారు. 5జీ వేలం కోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) సంప్రదింపులు జరుపుతోందని మంత్రి వైష్ణవ్ వెల్లడించారు. "ఫిబ్రవరి మధ్య నాటికి వారు తమ నివేదికను సమర్పిస్తారని నేను అనుకుంటున్నాను. బహుశా ఫిబ్రవరి చివరి వరకు/గరిష్టంగా మార్చి వరకు. ఆ వెంటనే మేము వేలం వేస్తాం" అని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 5జీ వేలం నిర్వహించాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటి) ఇంతకు ముందు ఆశాభావం వ్యక్తం చేయడంతో ఈ మాటలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. రాబోయే 5జీ వేలం నిర్దిష్ట కాలవ్యవధిని పేర్కొనడం ఈ దశలో కష్టమవుతుంది. ఎందుకంటే ట్రాయ్ తన అభిప్రాయాలను ఖరారు చేసే పట్టే సమయంపై చాలా ఆధారపడి ఉంటుంది అని మంత్రి తెలిపారు. (చదవండి: యాపిల్ ఎలక్ట్రిక్ కారు 3డీ మోడల్ చూస్తే మతిపోవాల్సిందే!) "కానీ, మా అంచనా ప్రకారం ఏప్రిల్-మేలో వేలం వేయవచ్చు. నేను ఇంతకు ముందు మార్చి ఆని అంచనా వేశాను. కానీ, సమయం పడుతుందని నేను అనుకుంటున్నాను.. సంప్రదింపులు ప్రక్రియ సంక్లిష్టమైనవి కాబట్టి, విభిన్న అభిప్రాయాలు వస్తున్నాయి" అని ఆయన అన్నారు. వచ్చే ఏడాది 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించడానికి గ్రౌండ్‌వర్క్‌ను సిద్ధం చేస్తున్నందున, బహుళ బ్యాండ్లలోని రేడియోవేవ్‌లకు సంబంధించిన ధర, క్వాంటం, ఇతర విధానాలపై సిఫార్సులను కోరుతూ డీఓటి ట్రాయ్‌ని సంప్రదించిందన్నారు. వీటిలో 700 మెగాహెర్ట్జ్, 800 మెగాహెర్ట్జ్, 900 మెగాహెర్ట్జ్, 1800 మెగాహెర్ట్జ్, 2100 మెగాహెర్ట్జ్, 2300 మెగాహెర్ట్జ్, 2500 మెగాహెర్ట్జ్ లతో పాటు 3,300-3,600 మెగాహెర్ట్జ్ బ్యాండ్లు(అవి గత వేలంలో లేవు) ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన చివరి రౌండ్ స్పెక్ట్రమ్ వేలంలో 855.6 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌కు ₹77,800 కోట్లకు పైగా బిడ్లు వచ్చాయి అని అన్నారు. -
ఐటీ పరిశ్రమకు వై2కే తరహా అవకాశం
న్యూఢిల్లీ: కరోనా తర్వాతి ప్రపంచం భారత ఐటీ పరిశ్రమకు వై2కే తరహా సందర్భం వంటిదని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు, భారీ అవకాశాలను సొంతం చేసుకునేందుకు పరిశ్రమ ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ 2021’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. నైపుణ్యాలపై ఐటీ పరిశ్రమ మరింతగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని చంద్రశేఖర్ ప్రస్తావించారు. తగినంత పని లేదని కొన్నేళ్ల క్రితం చెప్పిన కంపెనీలే.. ఇప్పుడు విదేశాల్లో నియామకాలు చేపడుతూ పెద్ద ఎత్తున నైపుణ్య వనరులను నిలుపుకుంటున్నట్టు తెలియజేశారు. ‘‘ప్రపంచం ఎంతగానో మారిపోయింది. డిజిటైజేషన్ ఆకాశామే హద్దుగా కొనసాగుతోంది. కనుక డిటిజైషన్కు, నైపుణ్యాలకు డిమాండ్ భారీగా పెరిగింది. మనం కరోనా తర్వాతి ప్రపంచంలో ఉన్నామని గుర్తించాలి. భారత ఐటీ పరిశ్రమకు ఇది వై2కే తరహా సందర్భం’’ అని చంద్రశేఖర్ అన్నారు. అవకాశాలను వెంటనే సొంతం చేసుకోలేకపోతే మరొకరు వీటిని తన్నుకుపోయే అవకాశం ఉంటుందన్నారు. ‘‘పరిశ్రమ, పరిశ్రమ సంఘాలు ముందుకు రావాలి. నైపుణ్య శిక్షణ, నెట్వర్క్ విస్తరణకు నూరు శాతం కష్టించి పనిచేయాలి’’ అని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరణలో, యూనికార్న్‌ల ఏర్పాటులో ఫిన్‌టెక్ కంపెనీల (టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవల కంపెనీలు) పాత్రను ఆయన ప్రస్తావించారు. ప్లాట్‌ఫామ్‌ల ఆధారిత పరిష్కారాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాయని ప్రశంసించారు. -
ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయం ప్రకటించండి
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఆరేళ్లుగా అద్భుత ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్ నగరానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) లేదా దానికి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కోరారు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆదివారం లేఖ రాశారు. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. జాతీయ సగటు 1.9 శాతంతో పోలిస్తే.. తెలం గాణ 7 శాతం వృద్ధి రేటుతో ఎగుమతులు రూ.1.4 లక్షల కోట్లకు చేరాయన్నారు. అ లాగే ఆఫీస్ స్పేస్ 8.7 మిలియన్ చదరపు అడుగులు పెరిగిందని, అమెజాన్ వెబ్ సర్వీసెస్, గోల్డ్‌మాన్ సాక్స్, ఫియట్ క్రిస్లార్ ఆటోమొబైల్స్ వంటి ప్రముఖ కంపెనీలు తెలంగాణకు పెట్టుబడులతో వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎమర్జింగ్ టెక్నాలజీతో పాటు పరిశోధన, అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కోసం అనేక పాలసీలు రూపొందించామని తెలిపారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ఐటీ రంగం వృద్ధికి అనువైన వాతావరణం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఐటీలో హైదరాబాద్‌ను ప్రోత్సహించండి హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సం బంధించి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేం ద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కలిశారని, తాను కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి స్పందన లేదన్నా రు. ఐటీఐఆర్‌పై కేంద్రం చేస్తున్న తాత్సారంతో ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆందోళన వ్య క్తం చేశారు. దేశానికి ఆర్థిక ఇంజన్లుగా పనిచేస్తున్న హైదరాబాద్ లాంటి నగరాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాలన్నారు. ఐటీఐఆర్‌పై యువత ఆశలను అడియాశలు చేయొద్దని లేఖలో పేర్కొన్నారు. -
సోషల్ మీడియాకు కళ్లెం
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దుర్విని యోగంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలను, నేరపూరిత సమాచారాన్ని కట్టడి చేసేందుకు సామాజిక మాధ్యమాల యాజమాన్యాలు చేపట్టాల్సిన చర్యలను నిర్ధారిస్తూ కఠిన నిబంధనావళిని విడుదల చేసింది. అలాగే, తమ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రసారమయ్యే కంటెంట్‌కు సంబంధించి యూట్యూబ్, ఆమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ సంస్థలు అనుసరించాల్సిన నియమాలను నిర్ధారించింది. వివాదాస్పద సమాచారంపై సత్వరమే స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారం కోసం అధికారులను నియమించి, వారు భారత్‌లోనే నివసించేలా చూడాలని ఆదేశించింది. భారత్‌లోని చిరునామాతో కార్యాలయం ఉండాలని పేర్కొంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా షేర్ అవుతున్న పోస్ట్‌లను, సంబంధిత ఖాతాలను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాల విషయంలో కేంద్రానికి, ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌కు మధ్య ఇటీవల వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా, ఓటీటీ, డిజిటల్ మీడియాల నియంత్రణకు ఉద్దేశించిన తాజా నియమ, నిబంధనలను ‘ద ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్’ పేరుతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం వెల్లడించారు. దర్యాప్తు సంస్థలతో సమన్వయం కోసం వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్ తదితర సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ఆమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ యాజమాన్యాలు భారత్‌లో ప్రత్యేకంగా ప్రతినిధులను నియమించుకోవాలని ఆ నిబంధనల్లో స్పష్టం చేశారు. అలాగే, వివాదాస్పద సమాచారాన్ని మొదట రూపొందించిన వ్యక్తిని 24 గంటల్లోపు గుర్తించి, ఆ సమాచారాన్ని, ఆ ఖాతాను తొలగించాలని పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే సమాచారం, లైంగిక దృశ్యాలు, మార్ఫ్డ్ ఫొటోలు, నగ్నచిత్రాల విషయంలోనూ ఫిర్యాదు అందిన 24 గంటల్లోపు స్పందించాలని ఆదేశించారు. వివాదాస్పద సమాచారంపై ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే.. తక్షణమే స్పందించాలని స్పష్టం చేశారు. వినియోగదారులు, ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం భారత్‌లోనే ఉండేలా ఒక అధికారిని నియమించాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలతో నెలవారీ నివేదికను రూపొందించాలని, వినియోగదారుల ఫిర్యాదులపై 15 రోజుల్లోగా స్పందించాలని ఆదేశించారు. దేశ సార్వభౌమత్వాన్ని, దేశ రక్షణను, సమాజంలో శాంతి భద్రతలను దెబ్బతీసే సమాచారంపై.. ఆ సమాచారాన్ని తొలుత రూపొందించిన వ్యక్తి వివరాలను ప్రభుత్వం కానీ, కోర్టులు కానీ కోరితే వెంటనే అందించాలని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వానికి, శాంతి భద్రతలకు భంగం కలిగించే ఏదైనా సమాచారాన్ని తొలగించాలని ప్రభుత్వం ఆదేశిస్తే.. తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు. వినియోగదారుల సంఖ్య ఆధారంగా సోషల్ మీడియా సంస్థలను రెండు విభాగాలుగా విభజిస్తూ నిబంధనలను రూపొందించారు. ప్రభావశీల సామాజిక మాధ్యమాలు మరింత జవాబుదారీతనంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. వార్తలు, వార్తాకథనాలను అందించే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కూడా వాటి యాజమాన్య వివరాలను స్పష్టంగా పేర్కొనాలని నిబంధనల్లో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలు, ఓటీటీ సంస్థలు, డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్స్ దుర్వినియోగం కాకుండా చూసేందుకే ఈ నిబంధనలను రూపొందించామని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆయా సంస్థలు మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 2011 నాటి నిబంధనల స్థానంలో తాజా నిబంధనలను తీసుకువచ్చామన్నారు. ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థలు తాజా నిబంధనలను అమలు చేసేందుకు మూడు నెలల గడవును ఇచ్చామన్నారు. ‘భారత్‌లో అంతర్జాతీయ సోషల్ మీడియా సంస్థల వ్యాపార విస్తరణను స్వాగతిస్తాం. విమర్శను, భిన్నాభిప్రాయాన్ని కూడా గౌరవిస్తాం. అలాగే, సోషల్ మీడియా వినియోగదారులకు తమ ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక సరైన వేదిక కూడా ఉండాలి’ అని ఆయన వివరించారు. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ డేటా చవకగా లభిస్తున్న భారత్.. సోషల్ మీడియా సంస్థలకు అతిపెద్ద లాభదాయక మార్కెట్‌గా మారిన విషయం తెలిసిందే. భారత్‌లో వాట్సాప్‌కు 53 కోట్ల మంది, ఫేస్‌బుక్‌కు 41 కోట్లమంది, యూట్యూబ్‌కు 44.8 కోట్ల మంది, ట్విటర్‌కు 1.75 కోట్లమంది, ఇన్‌స్ట్రాగామ్‌కు 21 కోట్లమంది వినియోగదారులు ఉన్నారు. సోషల్ మీడియా నిబంధనలను ఐటీ శాఖ పర్యవేక్షిస్తుంది. ఓటీటీ, డిజిటల్ మీడియా నిబంధనలను సమాచార ప్రసార శాఖ పర్యవేక్షిస్తుంది. అన్ని సోషల్ మీడియా సంస్థలు భారతీయ చట్టాలను గౌరవించాల్సిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల వినియోగదారుల సాధికారత లక్ష్యంగా కొత్త నిబంధనలు రూపొందాయని ట్వీట్ చేశారు. తాజా నిబంధనల ప్రకారం.. అన్ని సామాజిక మాధ్యమాల యాజమాన్యాలు ఒక చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, ఒక నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్, ఒక రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించుకోవాలి. వారు భారత్‌లోనే నివాసం ఉండాలి. ఫిర్యాదులకు సంబంధించిన నివేదికను నెలవారీగా వారు రూపొందించాలి. తమ అకౌంట్లను స్వచ్చందంగా వెరిఫై చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించాలి. కంటెంట్‌ను తొలగించడానికి సంబంధించి వినియోగదారుడికి ముందుగా సమాచారం, వివరణ ఇవ్వాలి. ఈ నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం వినియోగదారులకు ఉండాలి. వినియోగదారుల వయస్సు ఆధారంగా తాము ప్రసారం చేసే కంటెంట్‌ను యూనివర్సల్, యూ/ఏ 7+ సంవత్సరాలు, యూ/ఏ 13+ సంవత్సరాలు, యూ/ఏ 16+ సంవత్సరాలు, ఏ(పెద్దలకు మాత్రమే) అనే ఐదు విభాగాలుగా ఓటీటీ సంస్థలు విభజించాలి. ఆయా విభాగాలను స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. దాంతో, వినియోగదారులు తాము వీక్షించనున్న వీడియోపై ముందే ఒక అవగాహనకు వస్తారు. యూ/ఏ 13+ సంవత్సరాలు.. ఆ పై విభాగాలకు సంబంధించి పిల్లలకు అందుబాటులో లేకుండా పేరెంటల్ లాక్ సదుపాయాన్ని కల్పించాలి. అడల్ట్ కంటెంట్‌ను వీక్షించేందుకు వయస్సును నిర్ధారించే విశ్వసనీయమైన ప్రక్రియ ఉండాలి. వార్తలను, వార్తాకథనాలను ప్రసారం చేసే డిజిటల్ మీడియా సంస్థలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను, కేబుల్ టెలీవిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ చట్టంలోని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అపోహలను, అసత్యాలను ప్రచారం చేయకూడదు. స్వీయ నియంత్రణతో కూడిన మూడంచెల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. తొలి స్థాయిలో పబ్లిషర్ల స్వీయ నియంత్రణ, రెండో స్థాయిలో పబ్లిషింగ్ సంస్థలకు సంబంధించిన ఉమ్మడి స్వీయ నియంత్రణ విభాగం, మూడో స్థాయిలో పర్యవేక్షక నియంత్రణ ఉండాలి. రెండో స్థాయిలోని స్వీయ నియంత్రణ విభాగం కోసం రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, లేదా సంబంధిత వ్యవహారాల్లో నిపుణుడైన వ్యక్తిని నియమించుకోవచ్చు. ఆ కమిటీలో గరిష్టంగా ఆరుగురు సభ్యులుండాలి. సమాచార ప్రసార శాఖ వద్ద ఆ కమిటీని రిజిస్టర్ చెయ్యాలి. తమ అకౌంట్లను స్వచ్చందంగా వెరిఫై చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించాలి. కంటెంట్‌ను తొలగించడానికి సంబంధించి వినియోగదారుడికి ముందుగా సమాచారం, వివరణ ఇవ్వాలి. ఈ నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం వినియోగదారులకు ఉండాలి. వినియోగదారుల వయస్సు ఆధారంగా తాము ప్రసారం చేసే కంటెంట్‌ను యూని వర్సల్, యూ/ఏ 7+ సంవత్సరాలు, యూ/ఏ 13+ సంవత్సరాలు, యూ/ఏ 16+ సంవత్సరాలు, ఏ(పెద్దలకు మాత్రమే) అనే 5 విభాగాలుగా ఓటీటీ సంస్థలు విభజించాలి. అవి స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. యూ/ఏ 13+ సంవత్సరాలు.. ఆ పై విభాగాలకు సంబంధించి పిల్లలకు అందుబాటులో లేకుండా పేరెంటల్ లాక్ సదుపాయాన్ని కల్పించాలి. అడల్ట్ కంటెంట్‌ను వీక్షించేందుకు వయస్సును నిర్ధారించే విశ్వసనీయమైన ప్రక్రియ ఉండాలి. వార్తలను, వార్తాకథనాలను ప్రసారం చేసే డిజిటల్ మీడియా సంస్థలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ చట్టంలోని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అపోహలను, అసత్యాలను ప్రచారం చేయకూడదు. స్వీయ నియంత్రణతో కూడిన మూడంచెల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. తొలి స్థాయిలో పబ్లిషర్ల స్వీయ నియంత్రణ, రెండో స్థాయిలో పబ్లిషింగ్ సంస్థలకు సంబంధించిన ఉమ్మడి స్వీయ నియంత్రణ విభాగం, మూడో స్థాయిలో పర్యవేక్షక నియంత్రణ ఉండాలి. రెండో స్థాయిలోని స్వీయ నియంత్రణ విభాగం కోసం రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, లేదా రిటైర్డ్ హైకోర్టు దాన్యాయమూర్తి, లేదా సంబంధిత వ్యవహారాల్లో నిపుణుడైన వ్యక్తిని నియమించుకోవచ్చు. -
వాట్సాప్‌కు కేంద్రం ఝలక్!
న్యూఢిల్లీ : ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ మాధ్యమం వాట్సాప్ త్వరలోనే భారత్‌లో తన పేమెంట్ సర్వీసులను లాంచ్ చేయబోతుంది. దీని కోసం సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ రూపొందించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఈ కొత్త ఫీచర్‌ను బీటా టెస్టింగ్‌కు తీసుకొచ్చింది. అయితే వాట్సాప్ సర్వీసులు దేశవ్యాప్తంగా అధికారికంగా లాంచ్ చేయడానికి కంటే ముందే.. ఈ కంపెనీ భారత్‌లో కొత్త ఆఫీసును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ భారత్‌లో పేమెంట్ ఫీచర్‌ను లాంచ్ చేయాలనుకుంటే, ముందస్తుగా ఇక్కడ ఒక ఆఫీసు ఏర్పాటు చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆఫీసు ఏర్పాటు చేసేంతవరకు ఈ సర్వీసులు లాంచ్ చేయొద్దని తెలిపింది. పేమెంట్ సర్వీసులను లాంచ్ చేయనున్న నేపథ్యంలో కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మాట్ ఐడెమా, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్బీఐ మార్గదర్శకాలను కోడ్ చేసిన మంత్రిత్వ శాఖ, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్ లాంచ్ చేయబోయే ఈ సర్వీసులపై ప్రభుత్వం కూడా నిఘా ఉంచనుంది. రెండు దశల ధృవీకరణ, ఫైనాన్సియల్‌గా కీలకమైన డేటాను ఎలా స్టోర్ చేస్తారు అనే విషయాలపై వాట్సాప్‌కు ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. అంతేకాక వాట్సాప్‌కు ఫేస్‌బుక్‌కు చెందినది కావడంతో, డేటా షేరింగ్‌పై కూడా కేంద్రం పలు ప్రశ్నలు వేస్తోంది. ఇప్పటికే ఫేస్బుక్ తన యూజర్ల డేటా థర్డ్ పార్టీలకు షేర్ చేయడంపై కేంద్రం సీరియస్‌గా ఉన్న సంగతి తెలిసిందే. పేమెంట్ సర్వీసుల్లో కస్టమర్లకు ఏదైనా సమస్య వస్తే, వాటిని వెంటనే పరిష్కరించడానికి 24 గంటల టోల్-ఫ్రీ కస్టమర్ సర్వీసును ఏర్పాటు చేయాలని వాట్సాప్ యోచిస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో, వాట్సాప్ భారత్‌లో ఓ కార్యాలయం ఏర్పాటు చేయడాన్ని కీలకమైన అంశంగా పరిగణలోకి తీసుకుంది. అంతేకాక కొత్త ఆఫీసు ఏర్పాటుతో పాటు భారత్‌లోనూ ఓ బృందం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. వాట్సాప్ ఇండియా హెడ్, హెడ్ ఆఫ్ పాలసీలను నియమించుకోవడం కోసం వాట్సాప్ తీవ్ర కసరత్తు చేస్తోంది. భారత్‌లో ఆఫీసు ఏర్పాటు చేయడంతో కేవలం సమస్యలను పరిష్కరించడమే కాకుండా.. పేమెంట్స్ అప్లికేషన్లో విశ్వసనీయతను పెంచడానికి ఇది సహకరించనుందని తెలిసింది. వాట్సాప్ ఇప్పటికే తన ప్రైవసీ పాలసీని అప్డేట్ చేసింది. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్‌లను తన పార్టనర్ బ్యాంక్‌లుగా చేర్చుకుంది. జూలై నెల మొదటి వారంలోనే ఈ సర్వీసులను భారత్‌లో లాంచ్ చేయాలని అనుకుంది. కానీ కొత్త డెవలప్మెంట్తో ఈ ఫీచర్ లాంచింగ్ వాయిదా పడింది. -
ప్రభుత్వ సహకారంతోనే చెక్: వాట్సాప్
న్యూఢిల్లీ: నకిలీ వార్తలు, వదంతుల కారణంగా భారత్‌లో తీవ్రమైన హింస చెలరేగడంపై తాము ఆందోళన చెందుతున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఇలాంటి ఘటనల్ని నివారించేందుకు పలు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. పిల్లల కిడ్నాపర్లంటూ దేశవ్యాప్తంగా పలువురిని అల్లరిమూకలు ఇటీవల కొట్టిచంపిన నేపథ్యంలో నకిలీ వార్తలు, వదంతుల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం వాట్సాప్‌ను హెచ్చరించింది. దీంతో నకిలీ వార్తల కట్టడికి తీసుకోనున్న చర్యలపై వాట్సాప్ కేంద్ర ఐటీ శాఖకు బుధవారం లేఖ రాసింది. నకిలీ వార్తలు, వదంతుల్ని ప్రభుత్వం, పౌర సమాజం సంయుక్త సహకారంతోనే టెక్నాలజీ సంస్థలు ఎదుర్కొనగలవని వాట్సాప్ తెలిపింది. ప్రజల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తామనీ, అందుకు అనుగుణంగానే యాప్‌ను అభివృద్ధి చేశామని వెల్లడించింది. నకిలీ వార్తలు, వదంతుల్ని అరికట్టేందుకు ప్రొడక్ట్ కంట్రోల్, డిజిటల్ లిటరసీ, వార్తల్లోని నిజాలను తనిఖీ చేయడం వంటి పద్ధతుల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ పేర్కొంది. అంతేకాకుండా విచారణ సంస్థల విజ్ఞప్తులకు అనుగుణంగా పూర్తి వివరాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామంది. -
'తెలంగాణకు ప్రత్యేక పోస్టల్ సర్కిల్'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక పోస్టల్ సర్కిల్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. శనివారం హైదరాబాద్ వచ్చిన రవిశంకర ప్రసాద్ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం రవిశంకర ప్రసాద్ మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌కు మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న ఐటీ కంపెనీలు... ఐటీఐఆర్‌లో విస్తరణ చేపట్టవచ్చని సూచించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం గత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 160 కోట్లు నిధుల సరిపోవని వాటిని పెంచాలని కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో జరిగిన భేటీలో కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో చేపట్టిన నూతన ఇండస్ట్రీయల్ పాలసీ వివరాలను ఈ సందర్భంగా కేసీఆర్ కేంద్ర మంత్రికి వివరించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారం ఉంటుందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ హామీ ఇచ్చారు. -
ఏపీపై కేంద్ర మంత్రికి కేసీఆర్ ఫిర్యాదు
-
ఏపీపై కేంద్ర మంత్రికి కేసీఆర్ ఫిర్యాదు
హైదరాబాద్: విభజన చట్టం అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ వైఖరిపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కి ఆయన ఫిర్యాదు చేశారు. శనివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర ప్రసాద్... సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీ ప్రభుత్వంతో నెలకొన్న పలు అంశాల ప్రతిష్టంభనను రవి శంకర ప్రసాద్‌కు వివరించారు. రాజధాని నగరంలో ఐటీఐఆర్ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడానికి సహకరించాలని రవి శంకర ప్రసాద్‌కు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి, ఎగుమతులు, ఉద్యోగ అవకాశాలపై తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఈ భేటీలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సేవ ముసుగులో తీవ్రవాదులకు నిధులు
హైదరాబాద్: నిరుపేదల సేవ ముసుగులో కొన్ని స్వచ్ఛంద సంస్థలు తీవ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకరప్రసాద్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన మాట్లాడుతూ.... టెక్నాలజీ సామాన్యులకు చేరేలా స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని దాదాపు 2 లక్షల పంచాయతీలకు ఓఎఫ్సీ సదుపాయం కల్పించామని చెప్పారు. కాసేపట్లో సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో రవిశంకర్ ప్రసాద్ భేటీ కానున్నారు. అలాగే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర మంత్రి రవిశంకర్ తో భేటీ నిమిత్తం కేటీఆర్ తన దుబాయ్ పర్యటనను రద్దు చేసుకున్న విషయం విదితమే.