సేవ ముసుగులో తీవ్రవాదులకు నిధులు | Central minister Ravi Shankar prasad visits Hyderabad | Sakshi
Sakshi News home page

సేవ ముసుగులో తీవ్రవాదులకు నిధులు

Published Sat, Dec 13 2014 11:56 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

సేవ ముసుగులో తీవ్రవాదులకు నిధులు

సేవ ముసుగులో తీవ్రవాదులకు నిధులు

హైదరాబాద్: నిరుపేదల సేవ ముసుగులో కొన్ని స్వచ్ఛంద సంస్థలు తీవ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకరప్రసాద్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన మాట్లాడుతూ.... టెక్నాలజీ సామాన్యులకు చేరేలా స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

దేశంలోని దాదాపు 2 లక్షల పంచాయతీలకు ఓఎఫ్సీ సదుపాయం కల్పించామని చెప్పారు. కాసేపట్లో సచివాలయంలో సీఎం కేసీఆర్తో రవిశంకర్ ప్రసాద్ భేటీ కానున్నారు. అలాగే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర మంత్రి రవిశంకర్ తో భేటీ నిమిత్తం కేటీఆర్ తన దుబాయ్ పర్యటనను రద్దు చేసుకున్న విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement