
'మా రికార్డులను టీసర్కార్ ఇవ్వడం లేదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్రెడ్డి ఆరోపించారు. ఏపీ ఎంసెట్ కు సంబంధించి రికార్డులు అప్పగిస్తామని చెప్పినా... ఇప్పటివరకు ఇవ్వలేదని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్తున్నామని వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.