![Telangana Receives Heavy Rains In Next Three Days - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/25/rains.jpg.webp?itok=wQ68db3E)
సాక్షి, హైదరాబాద్ : రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో 3.1 కి.మీ. నుంచి 3.6 కి.మీ. మధ్య ఉపరితల ఆవర్తనం కోనసాగుతోందని పేర్కొంది. రాష్ట్రంలో నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, కొమురం భీం, సంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
24 గంటల్లో నమోదైన వర్షపాతం
మక్లూర్ (నిజామాబాద్) 11 సెం.మీ., దిలావర్‌పూర్ (నిర్మల్) 10 సెం.మీ., పిట్లం (కామారెడ్డి) 8 సెం.మీ., జైనూర్ (కొముం భీం) 7 సెం.మీ., కోహిర్ (సంగారెడ్డి) 7 సెం.మీ., సిర్పూర్(కొమురం భీం) 7 సెం.మీ., లింగంపేట్ (కామారెడ్డి) 6 సెం.మీ., నేకల్ (సంగారెడ్డి) 6 సెం.మీ., ఆర్మూర్ (నిజామాబాద్) 6 సెం.మీ., ఎడపల్లి (నిజామాబాద్) 6 సెం.మీ., జక్రాన్‌పల్లి (నిజామాబాద్) 5 సెం.మీ., నిజామాబాద్ 5 సెం.మీ., నిర్మల్ 5 సెం.మీ., కెరిమెరి (కొమురం భీం) 5 సెం.మీ., దండెపల్లి (మంచిర్యాల) 4 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment