సాక్షి, హైదరాబాద్: వేలాదిమంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ఎస్సై ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ ఫైర్, ఐటీ, ఫింగర్‌ప్రింట్ బ్యూరోలో ఎస్సై నియామకాల తుది ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) శనివారం వెల్లడించింది. ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://www.tslprb.inలో అందుబాటులో ఉంచింది. వివిధ విభాగాల్లో మొత్తం 1272 పోస్టుల కోసం నిర్వహించిన ఈ పరీక్షలో కటాఫ్ మార్కులు నిర్ణయించిన అనంతరం ఫలితాలను బోర్డు ప్రకటించింది. తుది జాబితాపై సందేహాలున్న అభ్యర్థులు నివృత్తి కోసం ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు సూచించారు. ఇందుకుగానూ ఎస్సీ, ఎస్టీలకు రూ.2000, ఇతర అభ్యర్థులకు రూ.3000 వేలుగా ఫీజు నిర్ణయించారు. ఈ దరఖాస్తులన్నీ ఆన్‌లైన్‌లో చేసుకోవాలని, ఎలాంటి వ్యక్తిగత వినతులు స్వీకరించబోమని చైర్మన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment