కాగజ్‌నగర్ రూరల్: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంతోనే రాష్ట్రం పరిపూర్ణం అవుతుందని ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో ‘బంగారు తెలంగాణ అంటే ఎట్లుండాలే’అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం కేవలం భౌగోళికంగా మాత్రమే రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్రంలో సస్యశ్యామల, పారిశ్రామిక, పర్యాటక, విజ్ఞాన రంగాలు అభివృద్ధి సాధ్యమైనప్పుడే సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయన్నారు.
ప్రాంతీయ అసమానతలు అధిగమించి తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్లో గల ప్రాజెక్టులను పూర్తి చేయాలని, తక్కువ ఖర్చుతో తొందరగా పూర్తయ్యే ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. రాష్ట్రం ఏర్పాటు తరువాత మన చరిత్ర, సంస్కతి గురించి గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన లేకపోవడం బాధకరమన్నారు. భవిష్యత్‌లో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందితేనే ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మాటకు అర్థం చేకూరుతుంది’ అని అన్నారు.
బంగారు తెలంగాణ గిట్లుండాలె..
Published Mon, Jun 23 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM
Advertisement