2న జెండావిష్కరణలు, అమరులకు నివాళి
వారం రోజుల పాటు ఊరూవాడా సందడి
సంస్కృతి ప్రతిబింబించేలా కార్యక్రమాలు
నూతన పథకాల అమలుకు ముహూర్తం
దశాబ్దాల ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రంఆవిర్భవించి ఏడాది కావస్తోంది. గతేడాది జూన్ 2న తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించింది. ఆ ఉద్విగ్న క్షణాలు.. హర్షాతి రేకాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అట్టహాసంగా రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించేందుకు సర్కారు సమాయత్తమైంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయూలకు పెద్దపీట వేస్తూ ఏడు రోజుల పాటు సంబురాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ముకరంపుర : జూన్ 2న జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థలు జాతీయ పతకాలను ఎగురవేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో భవనాలకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దుకునే పనిలో ఉన్నారు. నగరాలు, పట్టణాల్లో విద్యుద్దీపాల అలంకరణలతో మిరుమిట్లు గొలిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని అమరవీరుల స్థూపాలకు మరమ్మతులు చేయించి సుందరీకరిస్తున్నారు.
ఏడు రోజులపాటు సందడి..
రాష్ట్ర అవతరణ వేడుకలు జూన్ 7వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాకు రూ.1.20 కోట్లను కేటారుుంచింది. 2న జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. పోలీసుల గౌరవ వందనం అనంతరం సాంసృక కార్యక్రమాలు, లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ, వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి అవార్డులు, నగదు బహుమానం ప్రదానం చేస్తారు. మున్సిపల్, కార్పొరేషన్, మండలం, జిల్లాస్థాయిలో ఉత్తమ అవార్డులకు ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు.
వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఉత్తమ ఉద్యోగులను, సేవలకులను ఎంపిక చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఏడు అలాగే ఏడు రోజుల పాటు కరీంనగర్ సర్కస్‌గ్రౌండ్‌లో సాంసృక ప్రదర్శనలతో కళాకారులు అలరించనున్నారు. ముషాయిరా, ఖవ్వాలి, కవి సమ్మేళనం, తెలంగాణ వంటల కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్ర చరిత్ర, అభివ ృ్ధ తదితర అంశాలపై యువతకు, విద్యార్థులకు పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేయనున్నారు.
రాష్ట్ర సాంస్కృక సారథి చైర్మన్ రసమయి బా లకిషన్ నేతృత్వంలో జూన్ 4న జిల్లా కేంద్రం లోని అమరవీరుల స్థూపం నుంచి సర్కస్ గ్రౌండ్ వరకు 500 మంది కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ముషారుురా, ఖవ్వాలీ, కవి సమ్మేళనం, శాస్త్రీయ సంగీతం, జానపద న ృత్యాలు, ఏకపాత్రాభినయం, మిమిక్రీ, చిందు బాగోతాలు, గొల్లసుద్దులు వంటివి ఉత్సవాల్లో భాగం కానున్నాయి.
కమిటీల ఏర్పాటు
ఉత్సవాల నిర్వహణకు కలెక్టర్ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్, ఎస్పీ వైస్ చైర్మన్‌లుగా మొత్తం 10 మంది సభ్యులతో ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఉత్సవాలను పర్యవేక్షిస్తుంది. స్వాగత కార్యక్రమాలు, వంటల కార్యక్రమాలు, సాంసృక కార్యక్రమాలు, క్రీడల నిర్వహణ, బాణాసంచా, వేదికల ఏర్పాటు, ప్రచారం, రవాణా, కవి సమ్మేళనం, వసతుల కల్పన, లైటింగ్ సౌండ్ సిస్టం కమిటీలు ఏర్పాటు చేశారు.
ఒక్కో కమిటీలో 10 మంది వరకు సభ్యులున్నారు. కల్చరల్ కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర సాంసృక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ వ్యవహరించనున్నారు. ప్రొటోకాల్ కమిటీకి డీఆర్‌వో వీరబ్రహ్మయ్య, పబ్లిసిటీ కమిటీకి సీపీవో సుబ్బారావు, సావనీర్, కవిసమ్మేళనం నిర్వహణ కమిటీకి హౌసింగ్‌పీడీ నర్సింహారావు, జిల్లాస్థాయి అవార్డుల ఎంపిక కమిటీకి మంత్రి ఈటెల రాజేందర్, పోటీల కమిటీకి డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ చైర్మన్‌లుగా ఉన్నారు.
నూతన పథకాలకు శ్రీకారం
రాష్ట్రం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాల అమలుకు నిర్ణయం తీసుకుంది. వేడుకల సందర్బంగా ఈ పథకాలను ప్రకటించనున్నట్లు సమాచారం. నియోజకవర్గానికి 500 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, 58 జీవో ప్రకారం 125 గజాల స్థలానికి సంబంధించిన ఇళ్ల పట్టాలు పంపిణీ చేయూలని యోచిస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాలకు ఎంపిక చేసిన లబ్దిదారులకు ఆస్తులు పంపిణీ చేయనున్నారు.
అట్టహాసంగా...అవతరణ వేడుకలు
Published Fri, May 29 2015 6:19 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM
Advertisement
Advertisement