minister eetela rejender
-
అంబరాన్నంటిన సంబురం
♦ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ♦ ఆటపాటలతో బతుకమ్మను సాగనంపిన ఆడపడుచులు ♦ హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై కన్నుల పండుగ ♦ ఎల్బీ స్టేడియంలో వేలాది బతుకమ్మలు పేర్చిన మహిళలు ♦ ట్యాంక్‌బండ్‌కు భారీ ర్యాలీగా శోభాయాత్ర ♦ అలరించిన సాంస్కృతిక శకటాలు, కళాకారుల ప్రదర్శనలు ♦ రంగురంగుల విద్యుత్ కాంతులు.. ఎల్ఈడీ బెలూన్లు ♦ మిన్నంటిన బాణసంచా వెలుగులు సాక్షి, హైదరాబాద్: ‘పోయి రావమ్మా బతుకమ్మా.. మళ్లేడు దాకా సల్లంగ జూడు బతుకమ్మా.. వెళ్లిరావమ్మా..’ అంటూ కోట్లాది మంది మహిళలు తెలంగాణ ఆడపడుచును సాగనంపారు. ఇంటింటి ఆడపడుచుకు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలంతా తీరొక్క పూలతో పెద్ద బతుకమ్మను పేర్చి, పసుపుతో గౌరమ్మను చేసి.. మనసు నిండా పూజించి, చల్లంగ చూడాలని మొక్కుకుని ఊరేగింపుగా చెరువుల వద్దకు చేరుకున్నారు. ‘ఒక్కేసి పువ్వేసి చందమామా.. ఒక జాము అయే చందమామా, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ పాటలు పాడి, బతుకమ్మ ఆడి ‘వెళ్లి రావమ్మా.. బతుకమ్మా.. పోయిరావమ్మా గౌరమ్మా..’ అంటూ సాగనంపారు. వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, పద్మాక్షి అమ్మవారి గుడి ప్రాంగణం, భద్రకాళి ఆలయం వద్ద, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు వైభవంగా జరిగాయి. ఇక హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ‘సద్దుల బతుకమ్మ’ సంబరాలు అంబరాన్ని తాకాయి. వేలాది బతుకమ్మలు, జిల్లాల శకటాలు, కళాకారుల ప్రదర్శనలతో శోభాయాత్ర, రంగురంగుల విద్యుద్దీపాలు, బాణసంచా వెలుగులు. ఎల్ఈడీ బెలూన్లు అలరించాయి. శోభాయమానం.. సోమవారం నుంచే హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వేలాది మంది మహిళలు బతుకమ్మలను పేర్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 25 పెద్ద బతుకమ్మల వద్ద మంగళవారం సాయంత్రం ఐదున్నర సమయంలో ఎంపీ కవిత గౌరమ్మ పూజ చేశారు. ఆ తర్వాత కవితతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ర్యాలీగా బయలుదేరారు. వారంతా స్టేడియం బయటకు అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న జిల్లాల శకటాలు, కళాకారులతో కలసి ట్యాంక్‌బండ్‌కు శోభాయాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా నిర్వహించిన ఆటాపాటా, కళాకారుల ప్రదర్శనలు, నృత్యాలు, విన్యాసాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టాయి. మహిళల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన 12 మంది కళాకారుల ఒగ్గుడోలు, డప్పు నృత్యాలు అలరించాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కళాకారులు చేసిన భేరీ నృత్యం అందరినీ ఆకర్షించింది. వివిధ జిల్లాలకు చెందిన అస్తిత్వాన్ని ప్రదర్శించే సాంస్కృతిక శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాసర సరస్వతీ దేవి, పొచ్చెర్ల జలపాతం, వన దేవతలతో, అడవిని తలపించేలా రూపొందించిన ఆదిలాబాద్ శకటం.. గోల్కొండ, బిర్లా మందిర్‌తో ఐడీఎల్ కాలనీలో నిర్మిస్తున్న డబుల్బెడ్రూమ్ ఇళ్ల నమూనాతో కూడిన హైదరాబాద్ శకటం, వేములవాడ రాజరాజేశ్వర ఆలయం నమూనాతో రూపొందిన కరీంనగర్ శకటం, భద్రాచలం పుణ్యక్షేత్రంతో రూపొందించిన ఖమ్మం, మెదక్ మంజీరా శకటం, వరంగల్ కాకతీయ శకటం, ఆలంపూర్ జోగులాంబ ఆలయంతో మహబూబ్‌నగర్ శకటం ఆకట్టుకున్నాయి. హాజరుకాని సీఎం, గవర్నర్.. సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ దంపతులు, గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొంటారని తొలుత ప్రకటించినా.. వారు హాజరుకాలేదు. గతేడాది వేడుకలకు వారు హాజరవడమే కాకుండా సీఎం సతీమణి, గవర్నర్ సతీమణి బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు. ఈసారి రాకపోవడంతో చాలా మందికి నిరాశే ఎదురైంది. ట్యాంక్‌బండ్ వద్ద డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని, తలసాని, అజ్మీరా చందులాల్, టి.పద్మారావు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం అధికారిక నివాసంలో... సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం సీఎం సతీమణి శోభారాణి, కుమార్తె కవిత, పలువురు మహిళలు బతుకమ్మను పేర్చారు. అనంతరం అక్కడే బతుకమ్మ ఆడారు. బంజరాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలోనూ బతుకమ్మ శోభ కనిపించింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఇంట్లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కవిత, కొందరు మంత్రుల భార్యలు బతుకమ్మను పేర్చారు. జన సాగరం.. పూలహారం రాత్రి 8 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై లాంఛనంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. అప్పటికే బతుకమ్మల శోభాయాత్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో మహిళలు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. వేడుకలకు హాజరైన అతిథులు, అధికారులు పెద్ద సంఖ్యలో ఎల్ఈడీ బెలూన్లను గాల్లోకి వదిలారు. మరింత ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఈ బెలూన్లు నక్షత్రాల్లా కనిపిస్తూ ఆకట్టుకున్నాయి. అనంతరం మహిళలు బతుకమ్మ ఆడి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఎంపీ కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు బతుకమ్మ ఆడారు. వేడుకల నేపథ్యంలో తెలంగాణ సంస్కృతిని, జీవన విధానాన్ని, చరిత్రను ప్రతిబింబించే బతుకమ్మ పాటలు అలరించాయి. ఇక రంగురంగుల బాణసంచా మెరుపులతో హుస్సేన్‌సాగర్‌పై హరివిల్లులు విరబూశాయి. బతుకమ్మ శోభాయాత్ర నుంచి నిమజ్జనం వరకు ప్రతి ఘట్టాన్ని హైదరాబాద్ అంతటా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఓరుగల్లులో వైభవంగా.. సాక్షి ప్రతినిధి, వరంగల్: చారిత్రాత్మక వరంగల్ జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. బతుకమ్మ పుట్టుకతో సంబంధమున్న దేవతగా భావించే పద్మాక్షి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం జరిగిన వేడుకలలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. తంగేడు, గునుగు, సీతజడ, గుమ్మడి తదితర తీరొక్క పూలతో మురిపెంగా పేర్చిన బతుకమ్మలతో చెరువుల వద్దకు చేరుకున్నారు. బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడారు. భద్రకాళీ దేవాలయ ప్రాంగణం, రంగలీలా మైదానం, బంధం చెరువు, కట్టమల్లన్న చెరువు, పోచమ్మ మైదాన్, వడ్డేపల్లి చెరువు, ఉర్సు రంగసముద్రం చెరువు తదితర చోట్ల బతుకమ్మ వేడుకలు జరిగాయి. మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల పట్టణాల్లో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. -
అట్టహాసంగా...అవతరణ వేడుకలు
2న జెండావిష్కరణలు, అమరులకు నివాళి వారం రోజుల పాటు ఊరూవాడా సందడి సంస్కృతి ప్రతిబింబించేలా కార్యక్రమాలు నూతన పథకాల అమలుకు ముహూర్తం దశాబ్దాల ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రంఆవిర్భవించి ఏడాది కావస్తోంది. గతేడాది జూన్ 2న తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించింది. ఆ ఉద్విగ్న క్షణాలు.. హర్షాతి రేకాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అట్టహాసంగా రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించేందుకు సర్కారు సమాయత్తమైంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయూలకు పెద్దపీట వేస్తూ ఏడు రోజుల పాటు సంబురాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముకరంపుర : జూన్ 2న జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థలు జాతీయ పతకాలను ఎగురవేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో భవనాలకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దుకునే పనిలో ఉన్నారు. నగరాలు, పట్టణాల్లో విద్యుద్దీపాల అలంకరణలతో మిరుమిట్లు గొలిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని అమరవీరుల స్థూపాలకు మరమ్మతులు చేయించి సుందరీకరిస్తున్నారు. ఏడు రోజులపాటు సందడి.. రాష్ట్ర అవతరణ వేడుకలు జూన్ 7వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాకు రూ.1.20 కోట్లను కేటారుుంచింది. 2న జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. పోలీసుల గౌరవ వందనం అనంతరం సాంసృక కార్యక్రమాలు, లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ, వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి అవార్డులు, నగదు బహుమానం ప్రదానం చేస్తారు. మున్సిపల్, కార్పొరేషన్, మండలం, జిల్లాస్థాయిలో ఉత్తమ అవార్డులకు ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఉత్తమ ఉద్యోగులను, సేవలకులను ఎంపిక చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఏడు అలాగే ఏడు రోజుల పాటు కరీంనగర్ సర్కస్‌గ్రౌండ్‌లో సాంసృక ప్రదర్శనలతో కళాకారులు అలరించనున్నారు. ముషాయిరా, ఖవ్వాలి, కవి సమ్మేళనం, తెలంగాణ వంటల కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్ర చరిత్ర, అభివ ృ్ధ తదితర అంశాలపై యువతకు, విద్యార్థులకు పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేయనున్నారు. రాష్ట్ర సాంస్కృక సారథి చైర్మన్ రసమయి బా లకిషన్ నేతృత్వంలో జూన్ 4న జిల్లా కేంద్రం లోని అమరవీరుల స్థూపం నుంచి సర్కస్ గ్రౌండ్ వరకు 500 మంది కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ముషారుురా, ఖవ్వాలీ, కవి సమ్మేళనం, శాస్త్రీయ సంగీతం, జానపద న ృత్యాలు, ఏకపాత్రాభినయం, మిమిక్రీ, చిందు బాగోతాలు, గొల్లసుద్దులు వంటివి ఉత్సవాల్లో భాగం కానున్నాయి. కమిటీల ఏర్పాటు ఉత్సవాల నిర్వహణకు కలెక్టర్ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్, ఎస్పీ వైస్ చైర్మన్లుగా మొత్తం 10 మంది సభ్యులతో ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఉత్సవాలను పర్యవేక్షిస్తుంది. స్వాగత కార్యక్రమాలు, వంటల కార్యక్రమాలు, సాంసృక కార్యక్రమాలు, క్రీడల నిర్వహణ, బాణాసంచా, వేదికల ఏర్పాటు, ప్రచారం, రవాణా, కవి సమ్మేళనం, వసతుల కల్పన, లైటింగ్ సౌండ్ సిస్టం కమిటీలు ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 10 మంది వరకు సభ్యులున్నారు. కల్చరల్ కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర సాంసృక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ వ్యవహరించనున్నారు. ప్రొటోకాల్ కమిటీకి డీఆర్వో వీరబ్రహ్మయ్య, పబ్లిసిటీ కమిటీకి సీపీవో సుబ్బారావు, సావనీర్, కవిసమ్మేళనం నిర్వహణ కమిటీకి హౌసింగ్‌పీడీ నర్సింహారావు, జిల్లాస్థాయి అవార్డుల ఎంపిక కమిటీకి మంత్రి ఈటెల రాజేందర్, పోటీల కమిటీకి డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ చైర్మన్లుగా ఉన్నారు. నూతన పథకాలకు శ్రీకారం రాష్ట్రం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాల అమలుకు నిర్ణయం తీసుకుంది. వేడుకల సందర్బంగా ఈ పథకాలను ప్రకటించనున్నట్లు సమాచారం. నియోజకవర్గానికి 500 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, 58 జీవో ప్రకారం 125 గజాల స్థలానికి సంబంధించిన ఇళ్ల పట్టాలు పంపిణీ చేయూలని యోచిస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాలకు ఎంపిక చేసిన లబ్దిదారులకు ఆస్తులు పంపిణీ చేయనున్నారు. -
ఉద్యమం తరహాలో ఉత్సవాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ‘జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వారోత్సవ వేడుకలను గొప్పగా నిర్వహిస్తాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్నీ మర్చిపోయి ప్రజలంతా ఒక్కటై ఏ విధంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు నిర్వహించారో... జూన్ నుంచి 2నుంచి జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాల్లోనూ అదే విధంగా పాల్గొనాలి’ అని రాష్ర్ట ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అడిషనల్ జారుుంట్ కలెక్టర్ నాగేంద్ర, జగిత్యాల సబ్ కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్ఓ వీరబ్రహ్మయ్యలతో కలిసి ఈటల తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల వివరాలను వెల్లడించారు. జూన్ 2న ఉదయం 8.15 గంటలకు గ్రామ, మండల, మున్సిపాలిటీ, నగర పంచాయ తీ, కార్పొరేషన్లలో తెలంగాణ తల్లి విగ్రహా లకు, అమరవీరుల స్థూపాలకు సెల్యూట్ చేయడంతో రాష్ట్ర ఆవిర్భావ వారోత్సవాలు ప్రారంభమవుతాయి. జిల్లాలోని అన్ని ప్ర భుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తాం. తెలంగాణ సాధన కోసం పాటుపడిన ప్రొఫెసర్ జయశంకర్, అమరవీరుల చిత్రపటాలకు నివాళులు అర్పిస్తాం. సాయంత్రం జిల్లావ్యాప్తంగా సాంస్కృతిక, కళా ప్రదర్శనలు, తెలంగాణ వంటకాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తాం. జూన్ 3 నుంచి 7 వరకు ప్రతిరోజూ అన్నిచోట్ల రక్తదాన శిబిరాలు, వ్యాసరచన పోటీలు, క్రీడలు, కవి సమ్మేళనాలు నిర్వహిస్తాం. ప్రతిరోజు సాయంత్రం తెలంగాణ కళారూపాలు, బాగోతాలు, తెలంగాణ వంటకాల కార్యక్రమాలుంటాయి. ప్రభుత్వ కార్యాలయాలు, చౌరస్తాలన్నీ విద్యుత్ దీపాలతో అలంకరిస్తాం. మండల స్థాయిలో 10, నగర పంచాయతీ, మున్సిపాలిటీ స్థాయిలో 15, కార్పొరేషన్ స్థాయిలో 20, జిల్లాస్థాయిలో 30 మంది చొ ప్పున వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందిం చిన వారిని ఎంపిక చేసి నగదు, ప్రశంసా పత్రాలను అందజేస్తాం. ఇందుకోసం మం డల, నగర, మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థాయిలో ఎంపికైన వారికి రూ.10,116, జిల్లాస్థాయిలో ఎంపికైన వారికి రూ. 50,116ల చొప్పున నగదు అందజేస్తాం. తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల నిర్వహణ కోసం జిల్లాకు రూ.1.2 కోట్లు కేటాయించినప్పటికీ... అందులో రూ.90 లక్షలు అవార్డులకుపోగా, మిగిలిన రూ.30 లక్షలు ప్రచారానికి ఖర్చవుతుంది. మిగిలిన కార్యక్రమాల నిర్వహణకు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వర్గాలు, ఇతరులు సాయం అందించాలి. కరీంనగర్ సర్కస్ మైదానంలో జూన్ 3న ముషాయిరా, 5న ఖవ్వాళీ, కవి సమ్మేళనాలు నిర్వహిస్తాం. ఆరు రోజులపాటు తెలంగాణ వంటకాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని జిల్లాలకంటే కరీంనగర్లో రాష్ట్ర ఆవిర్భావ వారోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తామన్నారు. ప్రజలందరినీ భాగస్వాములను చేయాలి రాష్ట్ర అవతరణ వేడుకలలో ప్రజలందరినీ భాగస్వాములను చేసి విజ యవంతం చేయాలని మంత్రి ఈటల రాజేందర్ అంతకుముందు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో తెలంగాణ పాటల సీడీలోని పాటలు ప్రజలకు వినిపించాలన్నారు. ముఖ్యమంత్రి సందే శం ప్రతులు గ్రామాలలో పంపిణీ చేయాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, మం డల, డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. ప్రతి రోజు సాంస్కతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించాలని, నిర్వహించిన కార్యక్రమ వివరాలు ప్రతి రోజు జిల్లా కేంద్రానికి పంపాలని సూచించారు. -
‘కాకతీయ’ అక్రమాలకు అధికారులదే బాధ్యత
రాజకీయ ఒత్తిళ్లకు లొంగితే... అంతే పత్రికల్లో వచ్చే వార్తలకు వెంటనే స్పందించాల్సిందే అధికారులకు మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మిషన్ కాకతీయ కార్యక్రమంలో అక్రమాలు జరిగితే అధికారులనే బాధ్యులని చేస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధుల ఫోన్ల ఒత్తిడికి లొంగిపోయామని అధికారులు చెబితే ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ కార్యక్రమాల అమలు తీరుపై శనివారం నిర్వహించిన సమీక్షలో ఈటెల మాట్లాడారు. ఎంతో పవిత్ర ఆశయంతో రూపొందించిన మిషన్ కాకతీయ కార్యక్రమం అమలులో కరీంనగర్ జిల్లా బాగా వెనుకబడి ఉందన్నారు. జూన్‌లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇంకా చాలాచోట్ల పనులు ప్రారంభమే కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగత స్వార్ధం, బద్దకంతో వ్యవహరించే అధికారుల తీరుతోనే ఇలా జరుగుతోందన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయకపోతే ఆశించిన ఫలితాలు రావని అభిప్రాయపడ్డారు. మిషన్ కాకతీయ అక్రమాలకు సంబంధించి పత్రికల్లో వచ్చే వార్తలకు ఎప్పటికప్పుడు అధికారులు స్పందించి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణ అంచనాల్లో 35 శాతం వరకు తక్కువగా టెండర్ వేయడం పట్ల సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ‘అధికారుల అంచనా కంటే 35 శాతం వరకు తక్కువగా టెండర్ వేస్తే పనుల్లో నాణ్యతైనా లోపిస్తుంది... లేదంటే అధికారులే అంచనాలను అమాంతంగా పెంచి ఉండాలి. అంతే తప్ప పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోయే ప్రసక్తే ఉండదు’ అని అన్నారు. దీనిపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చెరువుల్లోని మట్టిని రైతులకు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ ఒక్కో ట్రాక్టర్‌కు రూ.50 చొప్పున కాంట్రాక్టర్లు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఆర్థికమంత్రి నియోజకవర్గంలోనే ఇది జరుగుతున్నట్లు పత్రికల్లోనూ వార్తలొస్తున్నాయని చెప్పారు. తన నియోజకవర్గంలో మట్టిని అమ్ముకునే పరిస్థితి లేదని, ఇప్పటికే ఇదే అంశంపై పలుమార్లు సమీక్ష జరిపానని ఈటెల తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ ఫారెస్ట్, రెవెన్యూ అధికారులెవరూ చెరువులవైపు ముఖం కూడా చూపడం లేదని, పనులు ప్రారంభించిన తాము మాత్రం ప్రజల దృష్టిలో చులకన అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నుంచి 9 గంటల విద్యుత్ వచ్చే ఏడాది నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు 9 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కెపాసిటీ పెరిగే అవకాశమున్నందున అందుకు తగినట్లుగా సబ్స్టేషన్లు ఉన్నాయా? అనే అంశంపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, బొడిగె శోభ, నగర మేయర్ రవీందర్‌సింగ్, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, అదనపు జేసీ నాగేంద్ర, అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థులతో పాటు భోజనం చేసిన మంత్రి
కరీంనగర్: ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో ప్రారంభించిన సన్నబియ్యం పథకం దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు . ఈ పథకం సక్రమంగా అమలు చేయడానికి మార్చి నెల నుంచి 50 మెట్రిక్ టన్నల బియ్యాన్ని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రి చెప్పారు. మంగళవారం ఆయన కరీనంగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రపల్లి గ్రామంలోని పాఠశాలలో కొత్తగా ఏర్పాటుచేసిన హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠ శాలలో మరామ్మత్తులు ఉంటే వాటిని వెంటనే పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.