పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా విస్తరణ | The expansion of the supply of gas through the pipeline | Sakshi
Sakshi News home page

పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా విస్తరణ

Published Thu, Jul 31 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా విస్తరణ

పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా విస్తరణ

కుత్భుల్లాపూర్‌లో ప్రారంభించిన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్

హైదరాబాద్: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్(బీజీఎల్) సంస్థ ఇంటింటికీ వంట గ్యాస్ సరఫరాను విస్తరించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కుత్భుల్లాపూర్ సమీపంలోని గోదావరి హోమ్స్‌కు పైప్‌లైన్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) సరఫరా చేసే ప్రక్రియను బుధవారం ప్రారంభించింది. ఇప్పటివరకు నల్సార్ వర్సిటీ క్యాంపస్, మేడ్చల్ మండల కేంద్రానికే పీఎన్జీ పరిమితమైంది.

లక్ష కుటుంబాలకు 2014 ఏప్రిల్ నాటికి పీఎన్జీ అందించాలని లక్ష్యం నిర్దేశించుకున్న బీజీఎల్ ఇప్పుడు 440 కుటుంబాలకే ఇవ్వగలుగుతోంది. విస్తరణపనులు కేవలం 32కి.మీ. మేరకు సాగాయి.
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement